News November 12, 2024
జనవరి నుంచి సన్నబియ్యం పథకం: ఉత్తమ్
TG: జనవరి నుంచి రాష్ట్రంలో సన్న బియ్యం పథకం ప్రారంభమవుతుందని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి వెల్లడించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇస్తున్నామన్నారు. రాష్ట్రంలో 80-85 లక్షల మెట్రిక్ టన్నుల సన్నధాన్యం ఉత్పత్తి అవుతోందన్నారు. అందులో 36లక్షల టన్నులు పీడీఎస్‌కు వచ్చినా సరిపోతుందన్నారు. నెలకు 2 లక్షల టన్నుల చొప్పున పేదలకు పంపిణీ చేస్తామని తెలిపారు.
Similar News
News December 6, 2024
16,347 టీచర్ పోస్టులు.. BIG UPDATE
AP: 16,347 టీచర్ పోస్టులతో మెగా DSC నోటిఫికేషన్ మరింత ఆలస్యం అయ్యే అవకాశం కన్పిస్తోంది. SC వర్గీకరణపై RR మిశ్రా నేతృత్వంలో నియమించిన ఏకసభ్య కమిషన్ నివేదిక వచ్చిన తర్వాతే <<14721880>>DSC<<>> ప్రక్రియ ప్రారంభిస్తామని విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. ఈ నివేదిక ఎప్పటికి వస్తుందో తనకు తెలియదని, ఆ అంశం తన పరిధిలో లేదని చెప్పారు. కమిషన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత 60 రోజుల్లో నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది.
News December 6, 2024
రేపు నల్గొండలో లక్ష మందితో CM రేవంత్ సభ
TG: CM రేవంత్ రెడ్డి రేపు నల్గొండలో పర్యటించనున్నారు. ప్రభుత్వం ఏర్పడి రేపటికి ఏడాది కానుండటంతో జిల్లా కేంద్రంలో లక్ష మందితో సభ నిర్వహించేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. బ్రహ్మణవెల్లెంల ప్రాజెక్ట్ డిస్ట్రిబ్యూటరీ ఛానళ్లు, గంధంవారిగూడెం వద్ద నిర్మించిన ప్రభుత్వ వైద్యకళాశాల తదితర అభివృద్ధి పనులను సీఎం ప్రారంభిస్తారని పార్టీ వర్గాలు తెలిపారు. మంత్రి కోమటిరెడ్డి ఆధ్వర్యంలో సభ ఏర్పాట్లు జరుగుతున్నాయి.
News December 6, 2024
RBI మీటింగ్: CRR తగ్గిస్తే ఏమవుతుందంటే..
CRR అంటే క్యాష్ రిజర్వు రేషియో. ప్రతి బ్యాంకు RBI వద్ద కొంత నగదును ఉంచాలి. ఎంతమేర ఉంచాలో RBI MPC నిర్ణయిస్తుంది. ప్రస్తుతమిది 4.5 శాతంగా ఉంది. నేటి మీటింగులో CRRను 50 బేసిస్ పాయింట్ల మేర తగ్గిస్తారన్న అంచనాలు ఉన్నాయి. ఇదే జరిగితే రూ.1.10 లక్షల కోట్లు అందుబాటులోకి వస్తాయి. ఈ నగదును బ్యాంకులు రుణాలుగా ఇస్తాయి. దీంతో లిక్విడిటీ పెరిగి ఆర్థిక కార్యకలాపాలు, కొనుగోలు శక్తి, వస్తూత్పత్తి పుంజుకుంటాయి.