News February 11, 2025
లోక్‌సభలో సంస్కృత అనువాదం వృథా ఖర్చే: ఎంపీ మారన్

లోక్‌సభ వ్యవహారాల్ని సంస్కృతంలోకి అనువదించడాన్ని DMK MP దయానిధి మారన్ సభలో వ్యతిరేకించారు. అది ప్రజాధనాన్ని వృథా చేయడమేనని అన్నారు. ‘2011 లెక్కల ప్రకారం దేశంలో సంస్కృతం మాట్లాడేవారు 73వేల మంది మాత్రమే ఉన్నారు. సభ వివరాల్ని సంస్కృతంలోకి తర్జుమా చేయాల్సిన అవసరం ఏమాత్రం లేదు’ అని స్పష్టం చేశారు. ఆయన వాదనను స్పీకర్ బిర్లా తోసిపుచ్చారు. సంస్కృతంతో పాటు లోక్‌సభలో 22 భాషలకు గుర్తింపు ఉందని గుర్తుచేశారు.
Similar News
News March 21, 2025
శ్రీశైలం ఘాట్‌రోడ్డులో నిలిచిన లారీ.. 5KMల ట్రాఫిక్ జామ్

AP: శ్రీశైలం ఘాట్ రోడ్డు మలుపు వద్ద ఇసుక లారీ నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. తుమ్మలబైలు నుంచి శ్రీశైలం వరకు 5 కి.మీ మేర బస్సులు, కార్లు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పోలీసులు అక్కడికి చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు శ్రమిస్తున్నారు.
News March 21, 2025
ఆ రోడ్లకు టోల్ విధించే ఆలోచన లేదు: మంత్రి కోమటిరెడ్డి

TG: గ్రామీణ రోడ్లు, రాష్ట్ర రహదారులకు టోల్ విధించే ఆలోచన లేదని స్పష్టం చేశారు. కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన 40 శాతం కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపారు. ప్రతి గ్రామం నుంచి మండలానికి డబుల్ రోడ్లు వేయిస్తామన్నారు. బీఆర్ఎస్ హయాంలో సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్‌కే రోడ్లు వేశారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శించారు. వాటికి చివరికి సింగరేణి నిధులు కూడా వాడారని అసెంబ్లీలో దుయ్యబట్టారు.
News March 21, 2025
ఢిల్లీలో పెట్రోల్‌తో నడిచే బైక్స్‌కు నో రిజిస్ట్రేషన్?

ఢిల్లీలో గాలి నాణ్యతను పెంపొందించేందుకు అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. పెట్రోల్‌తో నడిచే బైక్& స్కూటీలను నిషేధించాలని ప్రభుత్వం భావిస్తోంది. 2026 ఆగస్టు నుంచి ఎలక్ట్రిక్ బైక్స్‌కు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసేలా ‘ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ 2.0’ తీసుకొస్తారని సమాచారం. అలాగే, ఈ ఏడాది ఆగస్టు నుంచి ఇంధనంతో నడిచే త్రిచక్ర వాహనాల రిజిస్ట్రేషన్ కూడా నిలిపివేయనున్నట్లు తెలుస్తోంది.