News December 12, 2024

‘సరస్వతి’ భూములు వెనక్కి తీసుకున్న సర్కార్

image

AP: సరస్వతి పవర్ ఇండస్ట్రీస్‌కు చెందిన అసైన్డ్ భూములను వెనక్కి తీసుకుంటున్నట్లు పల్నాడు జిల్లా మాచవరం తహశీల్దార్ ఎం.క్షమారాణి తెలిపారు. మొత్తం 17.69 ఎకరాలను స్వాధీనం చేసుకుంటున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. వేమవరంలో 13.80 ఎకరాలు, పిన్నెల్లిలో 3.89 ఎకరాలను ప్రభుత్వం తిరిగి తీసుకుంది. వేమవరం, చెన్నాయపాలెం, పిన్నెల్లి గ్రామాల పరిధిలో సరస్వతి కంపెనీకి దాదాపు 2 వేల ఎకరాల భూములు ఉన్నట్లు తెలుస్తోంది.

Similar News

News January 17, 2025

ఉద్యోగులపై పెండింగ్ కేసులు.. పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు

image

AP: ఉద్యోగులపై విజిలెన్స్, శాఖాపరమైన కేసుల దర్యాప్తు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉండటం సరికాదని Dy.CM పవన్ అన్నారు. దీనివల్ల వారి పని తీరుపై ప్రభావం పడుతుందని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ పొందలేకపోతున్నారని చెప్పారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖల్లో ఉన్న కేసులపై ఆరా తీశారు. 3 వారాల్లో తనకు నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. త్వరగా కేసులను పరిష్కరించడంపై దృష్టిసారించాలన్నారు.

News January 17, 2025

సెలవులు ముగిశాయ్

image

తెలంగాణలోని స్కూళ్లకు నేటితో సంక్రాంతి సెలవులు ముగిశాయి. దాదాపు వారం రోజులు పండగ హాలిడేస్ ఎంజాయ్ చేసిన విద్యార్థులు రేపటి నుంచి బడి బాట పట్టనున్నారు. రాబోయే 2, 3 నెలలు పరీక్షాసమయం కావడంతో స్టూడెంట్స్ ఇక పుస్తకాలకే అంకితం కానున్నారు. కాగా ఈనెల 11 నుంచి 17 వరకు ప్రభుత్వం పాఠశాలలకు సంక్రాంతి సెలవులు ఇచ్చిన విషయం తెలిసిందే. అటు జూనియర్ కాలేజీలు ఇవాళ్టి నుంచి పున:ప్రారంభం అయ్యాయి.

News January 17, 2025

రేషన్‌కార్డుల ఎంపికలో గందరగోళం.. విమర్శలు

image

TG: రేషన్ కార్డుల లబ్ధిదారుల ఎంపిక తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం తమకు అందజేసిన జాబితా ప్రకారం గ్రామాల్లో సిబ్బంది సర్వే చేస్తున్నారు. ప్రజాపాలన సందర్భంగా కార్డు కోసం అప్లై చేసినా జాబితాలో పేరు లేకపోవడం ఏంటని చాలామంది సిబ్బందిని నిలదీస్తున్నారు. అర్హుల ఎంపికకు ప్రభుత్వం దేన్ని ప్రాతిపదికగా తీసుకుందని ప్రశ్నిస్తున్నారు. కులగణన ఆధారంగా సర్కార్ జాబితా రూపొందించినట్లు సమాచారం.