News October 15, 2024

Satellite Pics: పాంగాంగ్ తీరం వెంట చైనా కొత్త సైనిక స్థావరం!

image

పాంగాంగ్ సరస్సు ఉత్తరతీరంలో చైనా కొత్త సైనిక స్థావరాన్ని నిర్మించినట్టు సీనియర్ మిలిటరీ సోర్సెస్ తెలిపాయి. శాటిలైట్ ఇమేజెస్‌ను విశ్లేషించి LAC సమీపంలోని డ్రాగన్ భూమిలో ఈ సైట్ గుర్తించామని పేర్కొన్నాయి. ఇందులో 70 శాశ్వత నిర్మాణాలు ఉన్నాయని, మిసైళ్ల దాడి తీవ్రతను తగ్గించడమే లక్ష్యమని వెల్లడించాయి. భారత సరిహద్దు వెంబడి మిగిలిన స్థావరాలకు లాజిస్టిక్స్, ఫుడ్ సప్లైకి వీటిని ఉపయోగించుకోవచ్చని తెలిపాయి.

Similar News

News November 17, 2025

జిన్నింగ్ మిల్లుల బంద్‌.. రైతుల ఆవేదన!

image

TG: CCI విధానాలను వ్యతిరేకిస్తూ కాటన్ మిల్లర్లు నిరసనకు దిగారు. L1, L2 కేటగిరీలను ఎత్తివేయాలంటూ నేటి నుంచి జిన్నింగ్ మిల్లుల బంద్‌ చేపట్టారు. దీంతో రైతులపై మరో పిడుగు పడినట్లయింది. ఇప్పటికే ‘కపాస్’ యాప్‌లో స్లాట్ బుకింగ్, ఎకరాకు 7 క్వింటాళ్లే కొనుగోలు, తేమ 8-12% మించొద్దన్న నిబంధనలతో ఇబ్బందులు పడుతున్నారు. వానలు తగ్గడంతో తేమ సమస్య ఉండదనుకుంటే బంద్‌తో కొనుగోళ్లు ఆగుతున్నాయని ఆవేదన చెందుతున్నారు.

News November 17, 2025

వచ్చే ఏడాది నా పెళ్లి: సాయి దుర్గ తేజ్

image

టాలీవుడ్ హీరో సాయి దుర్గ తేజ్ ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మంచి సినిమాలు, గొప్ప జీవితం ఇచ్చిన దేవుడికి కృతజ్ఞతలు తెలిపేందుకే తిరుమల వచ్చానన్నారు. పెళ్లిపై ఓ జర్నలిస్టు ప్రశ్నించగా ‘వచ్చే ఏడాదిలోనే నా వివాహం ఉంటుంది’ అని సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం ఆయన ‘సంబరాల ఏటిగట్టు’ అనే మూవీలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇది వచ్చే సంవత్సరం విడుదల కానుంది.

News November 17, 2025

హిందువులపై దాడులు బాధాకరం: షేక్ హసీనా

image

బంగ్లాదేశ్‌లో యూనస్‌ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం మైనార్టీలు, ముఖ్యంగా హిందువులపై దాడులను ప్రోత్సహిస్తోందని మాజీ PM షేక్ హసీనా మండిపడ్డారు. దీంతో వారంతా పారిపోవాల్సి వస్తోందన్నారు. దేశంలో హింస పెరిగిపోయిందని, ప్రజాస్వామ్యం, లౌకిక నిర్మాణం క్షీణిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. యువత ఆందోళనలతో హసీనా గతేడాది ఆగస్టు 5 నుంచి భారత్‌లో ఆశ్రయం పొందుతోన్న విషయం తెలిసిందే.