News October 14, 2024

ఓలాపై సెటైరికల్ ట్వీట్.. మామూలుగా లేదుగా!

image

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు అకస్మాత్తుగా పేలిపోతున్నాయ్, సర్వీస్ బాగుండట్లేదంటూ ఎప్పటినుంచో ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ చేసిన సెటైరికల్ ట్వీట్ వైరల్ అవుతోంది. ఈ దసరాకు దేశవ్యాప్తంగా సంతోషాలు పంచుతామంటూ డెలివరీకి సిద్ధంగా ఉన్న స్కూటర్ల ఫొటోలను ఓలా ట్వీట్ చేసింది. ‘దయచేసి ఢిల్లీ NCRకు డెలివరీ చేయకండి. ఎందుకంటే సుప్రీంకోర్టు ఢిల్లీలో బాణసంచాను బ్యాన్ చేసింది’ అని రిప్లై ఇచ్చాడు.

Similar News

News January 28, 2026

UK ప్రధానులే లక్ష్యంగా చైనా ఆపరేషన్ ‘సాల్ట్ టైఫూన్’!

image

బ్రిటన్ రాజకీయాల్లో చైనా హ్యాకర్లు కలకలం రేపారు. ఏకంగా ముగ్గురు మాజీ PMలు బోరిస్, సునక్, లిజ్ ట్రస్‌కు క్లోజ్‌గా ఉన్న అధికారుల ఫోన్లను హ్యాక్ చేసినట్లు ‘ది టెలిగ్రాఫ్’ పేర్కొంది. ఆపరేషన్ ‘సాల్ట్ టైఫూన్’ పేరుతో 2021-2024 వరకు ఈ గూఢచర్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఇప్పటికీ ఇది కొనసాగుతోందన్న అనుమానాలున్నాయి. ఏకంగా ప్రధాని నివాసంలోకే చైనా హ్యాకర్లు చొరబడ్డారని అక్కడి మీడియా కోడై కూస్తోంది.

News January 28, 2026

బాఫ్టా రేసులో మన ‘బూంగ్’.. మణిపురీ మ్యాజిక్!

image

ఫర్హాన్ అక్తర్ నిర్మించిన మణిపురీ చిత్రం ‘Boong’ ప్రతిష్ఠాత్మక BAFTA 2026 నామినేషన్లలో చోటు సంపాదించింది. లక్ష్మీప్రియా దేవి డైరెక్ట్ చేసిన ఈ మూవీ ‘బెస్ట్ చిల్డ్రన్స్ ఫిల్మ్’ కేటగిరీలో పోటీ పడుతోంది. మణిపుర్ నేపథ్యంతో సాగే ఓ బాలుడి కథతో తీసిన ఈ మూవీ ఇప్పటికే అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో రచ్చ చేస్తోంది. గ్లోబల్ స్టేజ్‌పై ఇండియన్ రీజినల్ సినిమా ఇలా మెరవడంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

News January 28, 2026

రాష్ట్ర ప్రజలకు CM రేవంత్ శుభాకాంక్షలు

image

TG కుంభమేళాగా పేరొందిన మేడారం మహా జాతర రేపు ప్రారంభంకానుంది. ఈ జాతరను వైభవంగా జరుపుకోవాలని CM రేవంత్ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ విభాగాలన్నీ సమన్వయంతో పని చేయాలని US నుంచి CM ఫోన్‌లో ఉన్నతాధికారులకు సూచించారు. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తులు పోలీసులకు సహకరించాలని కోరారు. మరోవైపు తెలంగాణ ప్రజలు సుభిక్షంగా జీవించేలా దీవించాలని సమ్మక్క-సారలమ్మను మాజీ CM KCR సైతం ప్రార్థించారు.