News October 14, 2024
ఓలాపై సెటైరికల్ ట్వీట్.. మామూలుగా లేదుగా!
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు అకస్మాత్తుగా పేలిపోతున్నాయ్, సర్వీస్ బాగుండట్లేదంటూ ఎప్పటినుంచో ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ చేసిన సెటైరికల్ ట్వీట్ వైరల్ అవుతోంది. ఈ దసరాకు దేశవ్యాప్తంగా సంతోషాలు పంచుతామంటూ డెలివరీకి సిద్ధంగా ఉన్న స్కూటర్ల ఫొటోలను ఓలా ట్వీట్ చేసింది. ‘దయచేసి ఢిల్లీ NCRకు డెలివరీ చేయకండి. ఎందుకంటే సుప్రీంకోర్టు ఢిల్లీలో బాణసంచాను బ్యాన్ చేసింది’ అని రిప్లై ఇచ్చాడు.
Similar News
News November 3, 2024
నవంబర్ 3: చరిత్రలో ఈరోజు
* 1874: సాహితీవేత్త, నాటకరంగ ప్రముఖుడు మారేపల్లి రామచంద్ర శాస్త్రి మరణం
* 1906: బాలీవుడ్ నటుడు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డీ పృథ్వీరాజ్ కపూర్ జననం
* 1933: నోబెల్ బహుమతి పొందిన భారత తొలి ఆర్థిక శాస్త్రవేత్త అమర్త్యసేన్ పుట్టినరోజు
* 1937: ప్రముఖ సింగర్ జిక్కి జయంతి
* 1940: విప్లవ రచయిత వరవరరావు పుట్టినరోజు
* 1998: విలక్షణ నటుడు పీఎల్ నారాయణ మరణం
News November 3, 2024
పుట్టినరోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News November 3, 2024
భారత్‌ను సైబర్ ముప్పు దేశాల జాబితాలో చేర్చిన కెనడా.. ఖండించిన కేంద్రం
కెనడా మరోసారి కవ్వింపు చర్యలకు దిగింది. తాజాగా భారత్‌ను సైబర్ ముప్పు దేశాల జాబితాలో చేర్చింది. కెనడాలో సైబర్ నేరాలకు భారత్ ప్రయత్నిస్తోందని, భారత ప్రభుత్వ ప్రాయోజిత సైబర్ నేరగాళ్లు గూఢచర్యం కోసం కెనడా ప్రభుత్వ నెట్‌వర్క్‌లపై దాడికి పాల్పడవచ్చని భావిస్తున్నట్టు పేర్కొంది. అయితే ఈ ఆరోపణలను భారత్ ఖండించింది. ఇది భారత్‌పై దాడికి కెనడా అనుసరిస్తున్న మరో వ్యూహంగా అభివర్ణించింది.