News October 25, 2024
సత్య నాదెళ్ల శాలరీ: ఏడాదిలోనే రూ.220 కోట్లు జంప్
మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెళ్ల వార్షిక వేతనం భారీగా పెరిగింది. అంతకు ముందున్న రూ.447 కోట్లతో పోలిస్తే గత ఆర్థికఏడాది ఏకంగా రూ.664 కోట్లు పొందారు. ఇందులో క్యాష్ ఇన్సెంటివ్స్ తక్కువ, స్టాక్ ఆప్షన్సే ఎక్కువగా ఉన్నట్టు SEC ఫైలింగ్ ద్వారా తెలిసింది. టాప్ ఎగ్జిక్యూటివ్స్ ఈమెయిళ్లను రష్యా యాక్సెస్ చేయడంతో తనను బాధ్యుడిని చేసి వేతనం తగ్గించాలని నాదెళ్ల కోరినప్పటికీ కంపెనీ నమ్మకం ఉంచింది.
Similar News
News November 5, 2024
గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష తేదీ మారుస్తారా?
AP: జనవరి 5న జరగాల్సిన గ్రూప్-2 మెయిన్స్ పరీక్షను అభ్యర్థుల వినతి మేరకు వాయిదా వేయడంపై అధికారులు చర్చిస్తున్నారు. DSC పరీక్షల తేదీలను అనుసరించి దీనిపై నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారు. మెయిన్స్‌కు 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాలని, డీవైఈవో పరీక్ష కటాఫ్ మార్కులు తగ్గించాలని అభ్యర్థులు కోరుతున్నారు. ఇదే విషయంపై ఎమ్మెల్సీలు చిరంజీవి, లక్ష్మణరావు APPSC ఛైర్‌పర్సన్ అనురాధకు విజ్ఞప్తి చేశారు.
News November 5, 2024
డిసెంబర్ 19 నుంచి హైదరాబాద్ బుక్ ఫెయిర్
పుస్తక ప్రియులకు శుభవార్త. హైదరాబాద్ బుక్ ఫెయిర్ మళ్లీ వచ్చేస్తోంది. డిసెంబర్ 19 నుంచి 29 వరకు ఎన్టీఆర్ స్టేడియంలో బుక్ ఫెయిర్ నిర్వహించనున్నట్లు సొసైటీ ప్రకటించింది. స్టాల్స్ ఏర్పాటు చేయాలనుకునేవారు ఈనెల 15లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. గతంలో పుస్తక ప్రదర్శన మ.2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఉండేదని, ఈసారి మ.12 గంటల నుంచి రా.9 గంటల వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించింది.
News November 5, 2024
ఆరు నెలలకోసారి కొత్త పింఛన్లు: మంత్రి కొండపల్లి
AP: ఎన్టీఆర్ భరోసా కింద జనవరిలో కొత్త పింఛన్ల మంజూరుకు చర్యలు తీసుకోవాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత 6 నెలలకోసారి అర్హతను బట్టి కొత్తవారికి పెన్షన్లు మంజూరు చేయాలని సూచించారు. భర్త చనిపోయినవారు డెత్ సర్టిఫికెట్ సమర్పించిన మరుసటి నెల నుంచే పింఛన్ ఇవ్వాలని స్పష్టం చేశారు. 3 నెలల పింఛన్ ఒకేసారి ఇచ్చే విధానం డిసెంబర్ నుంచే అమలు చేయాలన్నారు.