News December 31, 2024

పొదుపు పథకాలు.. వడ్డీ రేట్లు ఇలా

image

స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్‌పై వడ్డీ రేట్లను మరోసారి కేంద్రం యథాతథంగా ఉంచింది. JAN 1 నుంచి MAR 31 వరకు పాత రేట్లే కొనసాగుతాయని నోటిఫికేషన్ జారీ చేసింది. సుకన్య సమృద్ధి యోజనకు 8.2%, మూడేళ్ల టర్మ్ డిపాజిట్‌కు 7.1%, PPFకు 7.1%, పోస్టాఫీస్ సేవింగ్స్ స్కీమ్‌కు 4% వడ్డీ లభిస్తుందని తెలిపింది. కిసాన్ వికాస్ పత్ర పథకం(115 నెలల కాలపరిమితి)పై 7.5%, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్‌పై 7.7% వడ్డీ ఇస్తామంది.

Similar News

News January 16, 2025

Q3లో రిలయన్స్, జియో ఆదాయాలు ఇలా..

image

2024-25 Q3లో 7 శాతం వృద్ధితో రూ.18,540 కోట్ల నికర ఆదాయం వచ్చినట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రకటించింది. మొత్తం ఆదాయం రూ.2.43 లక్షల కోట్లకు చేరినట్లు తెలిపింది. ఇక డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి జియో ఆదాయం రూ.6,681 కోట్లుగా నమోదైనట్లు పేర్కొంది. 2023 డిసెంబర్ నాటికి రూ.5,447 కోట్లు ఉండగా ఈసారి 26 శాతం పెరిగినట్లు వెల్లడించింది.

News January 16, 2025

నితీశ్‌కు లోకేశ్ అభినందనలు

image

AP: రాష్ట్రంలోని యువ క్రీడాకారులకు క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి స్ఫూర్తిగా నిలిచారని మంత్రి లోకేశ్ కొనియాడారు. భారత జట్టుకు మరింతగా సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఇటీవల ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్‌లో సత్తా చాటిన నితీశ్ మంత్రిని తాజాగా కలిసారు. ఈ సందర్భంగా మంగళగిరి చేనేత శాలువాతో సన్మానించిన లోకేశ్, జ్ఞాపికను అందించారు.

News January 16, 2025

ఫిబ్రవరి 14 నుంచి WPL ప్రారంభం

image

వచ్చే నెల 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ప్రారంభం కానున్నట్లు BCCI ప్రకటించింది. బరోడా వేదికగా బెంగళూరు-గుజరాత్ మధ్య తొలి మ్యాచ్‌తో సమరానికి తెర లేవనుంది. మొత్తం 5 జట్లు పాల్గొనే ఈ మెగా ఈవెంట్‌లో 22 మ్యాచ్‌లు జరుగుతాయి. బరోడాతో పాటు బెంగళూరు, లక్నో, ముంబైని వేదికలుగా ఖరారు చేశారు. మార్చి 15న ముంబైలో ఫైనల్ జరగనుంది. పూర్తి షెడ్యూల్‌ను పైన ఫొటోల్లో చూడొచ్చు.