News March 28, 2025

సేవింగ్స్ స్కీమ్స్‌.. వడ్డీ రేట్లు యథాతథం

image

స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్‌పై వడ్డీ రేట్లను కేంద్రం యథాతథంగా కొనసాగించింది. ఏప్రిల్ 1 నుంచి జూన్ 30 వరకు ప్రస్తుత వడ్డీ రేట్లే ఉంటాయని తెలిపింది. సుకన్య సమృద్ధి యోజనకు 8.2%, మూడేళ్ల వ్యవధి డిపాజిట్లకు, PPFకు 7.1% ఉంటుంది. 115 నెలల కిసాన్ వికాస్ పత్రకు 7.5%, NCSకు 7.7%, నెలవారీ ఆదాయ పథకంపై 7.4% వడ్డీ ఉంటుంది. 2023-24 చివరి త్రైమాసికం నుంచి ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

Similar News

News April 21, 2025

ఈ ఏడాది చివరికల్లా డయాఫ్రమ్ వాల్ పూర్తి: నిమ్మల

image

AP: పోలవరం ప్రాజెక్టులో కొత్త డయాఫ్రమ్ వాల్ పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. రెండు కట్టర్లు, రెండు గ్రాబర్లతో 202 మీటర్లకు పైగా నిర్మాణ పనులు పూర్తి చేశామన్నారు. ఈ నెల 30 నాటికి మూడో కట్టర్ కూడా అందుబాటులోకి వస్తుందని, ఈ ఏడాది చివరికల్లా వాల్ పూర్తి చేస్తామని పేర్కొన్నారు. 2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందని వివరించారు.

News April 21, 2025

బీటెక్, MBA చేసినా నిరుద్యోగులుగానే!

image

భారతదేశంలో గ్రాడ్యుయేట్ల పరిస్థితిపై ‘అన్‌స్టాప్’ నివేదిక విడుదల చేసింది. దాదాపు 83% మంది ఇంజినీరింగ్ విద్యార్థులు, 50శాతం మంది MBA గ్రాడ్యుయేట్లు ఎలాంటి ఉద్యోగం, ఇంటర్న్‌షిప్ పొందలేదని తెలిపింది. 2024లో ఇంటర్న్‌షిప్ పొందిన వారిలోనూ నలుగురిలో ఒకరిని ఫ్రీగా పనిచేయించుకున్నట్లు పేర్కొంది. విద్యార్థుల్లో నైపుణ్యం పెంచే విధంగా విద్యా సంస్థలు కృషి చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

News April 21, 2025

త్వరలో తులం బంగారం రూ.1.25 లక్షలు?

image

అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం కారణంగా బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతాయని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ యుద్ధం మరింత తీవ్రమైతే 2025 చివరినాటికి బంగారం ధర ఔన్స్‌కు $4500కి చేరుకోవచ్చని ప్రముఖ ట్రేడ్ దిగ్గజం ‘గోల్డ్‌మన్ సాచ్స్’ పేర్కొంది. ఔన్స్ ధర $4500 అయితే భారత మార్కెట్లో 10 గ్రాముల బంగారం రూ.1.25 లక్షలకు చేరుకుంటుంది. కాగా, ఇవాళ తొలిసారి బంగారం రూ.లక్షను టచ్ చేసిన విషయం తెలిసిందే. SHARE IT

error: Content is protected !!