News November 10, 2024
SAvsIND: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా
భారత్, దక్షిణాఫ్రికా మధ్య గెబేహాలో జరుగుతున్న రెండో టీ20లో సౌతాఫ్రికా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
భారత జట్టు: సంజూ, అభిషేక్, సూర్యకుమార్, తిలక్, హార్దిక్, రింకూ, అక్షర్, అర్షదీప్, బిష్ణోయ్, ఆవేశ్, వరుణ్ చక్రవర్తి
సౌతాఫ్రికా జట్టు: రికిల్‌టన్, హెండ్రిక్స్, మార్క్రమ్, స్టబ్స్, క్లాసెన్, మిల్లర్, జాన్సెన్, సైమ్‌లేన్, కొయెట్జీ, మహరాజ్, పీటర్
Similar News
News December 14, 2024
అల్లు అరవింద్‌కు సీఎం చంద్రబాబు ఫోన్
అల్లు అర్జున్ తండ్రి అరవింద్‌కు ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్ చేశారు. అల్లు అర్జున్ అరెస్టు ఘటనపై ఆరా తీసి పరామర్శించారు. ఈ ఘటనపై ఆందోళన చెందవద్దని అరవింద్‌కు సూచించారు. కుటుంబం మొత్తం ధైర్యంగా ఉండాలని భరోసా నింపారు.
News December 14, 2024
ఆధార్ కార్డు ఉన్న వారికి ALERT
పదేళ్లుగా ఆధార్ వివరాలు మార్చని వారు ఎలాంటి ఛార్జీలు చెల్లించకుండా ఉచితంగా అప్‌డేట్ చేసుకునే అవకాశం రేపటి(డిసెంబర్ 14)తో ముగియనుంది. ఎల్లుండి నుంచి ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే పలుమార్లు UIDAI గడువు పొడిగించగా, మరోసారి పెంచుతుందా? లేదా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. మైఆధార్ పోర్టల్‌లో లాగిన్ అయ్యి డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసి, అప్‌డేట్ చేసుకోవచ్చు.
News December 13, 2024
CM చంద్రబాబుకు హ్యాట్సాఫ్ చెప్పాలనిపిస్తుంది: పవన్
AP: CM చంద్రబాబును Dy.CM పవన్ ప్రశంసించారు. స్వర్ణాంధ్ర-2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ సందర్భంగా మాట్లాడుతూ ‘ఆయన 4 దశాబ్దాల అనుభవం ఉన్న పార్టీని నడిపించాలి. తన కుటుంబంతో పాటు 5 కోట్ల కుటుంబాలను చూసుకోవాలి. వారి అవసరాలను తీర్చాలి. శత్రువుల దాడులనూ తట్టుకోవాలి. అయినా కూడా ఉన్న 24 గంటలను ప్రజల కోసం ఎలా ఉపయోగించాలని ఆలోచిస్తారు. అందుకే ఆయనకు హ్యాట్సాఫ్ చెప్పాలనిపిస్తుంది’ అని వ్యాఖ్యానించారు.