News June 26, 2024
పైరసీకి నో చెప్పండి: వైజయంతి మూవీస్

రేపు ‘కల్కి 2898ఏడీ’ విడుదల సందర్భంగా ఆ సినిమా నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ప్రేక్షకులకు ట్విటర్ వేదికగా విజ్ఞప్తి చేసింది. ‘ఇది 4ఏళ్ల ప్రయాణం, నాగ్ అశ్విన్ బృందం చేసిన కష్టానికి ప్రతిఫలం. ప్రపంచస్థాయిలో దీన్ని తీసుకొచ్చేందుకు ఎక్కడా రాజీపడకుండా తెరకెక్కించాం. ఆ కష్టాన్ని గౌరవించి సినిమా చూసిన వారు కథ వివరాలను చెప్పొద్దు. పైరసీనీ ప్రోత్సహించొద్దు’ అని కోరింది.
Similar News
News February 17, 2025
నేటి నుంచి ANMల సమ్మెబాట

TG: తమ డిమాండ్ల పరిష్కారం కోసం రాష్ట్రంలోని 3,422 మంది సెకండ్ ఏఎన్ఎమ్‌లు నేటి నుంచి సమ్మెబాట పట్టనున్నారు. 636 PHCలు, 235 UPHCలలోని సిబ్బంది విధులను బహిష్కరించనున్నారు. తమను ఫస్ట్ ఏఎన్‌ఎంలుగా పర్మినెంట్ చేయాలని, 100 శాతం గ్రాస్ శాలరీ, రూ.10 లక్షల హెల్త్, లైఫ్ బీమాను వర్తింపజేయాలని వారు కోరుతున్నారు. గత నెల 27వ తేదీనే సమ్మె నోటీసు ఇచ్చామని చెబుతున్నారు.
News February 17, 2025
నేడు తిరుపతిలో దేవాలయాల సమ్మిట్.. ముగ్గురు సీఎంల హాజరు

AP: తిరుపతిలో నేటి నుంచి 3 రోజులపాటు అంతర్జాతీయ దేవాలయాల సమ్మేళనం జరగనుంది. ఈ కార్యక్రమంలో ఇవాళ ఏపీ, మహారాష్ట్ర, గోవా సీఎంలు చంద్రబాబు, ఫడణవీస్, ప్రమోద్ సావంత్, కేరళ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ పాల్గొననున్నారు. వీరు ఇంటర్నేషనల్ టెంపుల్ ఎక్స్‌పోను ప్రారంభిస్తారు. ఎక్స్‌పోలో భాగంగా నిపుణుల మధ్య ఆలయాలపై చర్చలు, వర్క్‌షాపులు జరుగుతాయి. దాదాపు 100 ఆలయాలకు చెందిన ప్రతినిధులు హాజరు కానున్నారు.
News February 17, 2025
నేటి నుంచి GOVT స్కూల్ విద్యార్థులకు కంటి పరీక్షలు

TG: GOVT పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నేటి నుంచి కంటి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే రెండు విడతలుగా 89,245మందికి పైగా చిన్నారులకు గత ఏడాది పరీక్షలు ముగిశాయి. వారిలో 88,676మందిలో దృష్టిలోపాలున్నాయని అధికారులు గుర్తించారు. ఇక ఈరోజు నుంచి వచ్చే నెల 5 వరకూ మూడో విడత పరీక్షలు ప్రారంభం జరగనున్నాయి. సమస్య ఎక్కువగా ఉన్న పిల్లలకు కళ్లజోళ్లను అందివ్వనున్నారు.