News February 15, 2025
SBI: లోన్లు తీసుకున్నవారికి గుడ్‌న్యూస్

ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐ తన వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇవాళ్టి నుంచి రెపో రేటును 6.50 శాతం నుంచి 6.25 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. 25 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో హోమ్ లోన్స్, పర్సనల్ లోన్స్, రిటైల్ లోన్స్‌పై వడ్డీ రేట్లు తగ్గినట్లు తెలిపింది. కొత్తగా రుణాలు తీసుకునేవారికి ఇది మంచి అవకాశమని పేర్కొంది. ఎంసీఎల్ఆర్, బీపీఎల్ఆర్ రేట్లలో ఎలాంటి మార్పులు లేవని వెల్లడించింది.
Similar News
News March 13, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News March 13, 2026
40ల్లో ఈ తప్పులు చేయకండి!

రిటైర్మెంట్ లైఫ్ హ్యాపీగా ఉండాలంటే 40-50ఏళ్ల మధ్య తీసుకునే ఆర్థిక నిర్ణయాలు కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే ఆ ఏజ్‌లో జాబ్ మారేటప్పుడు PF విత్‌డ్రా చేయొద్దని, తొందరపడి ఒకటి కంటే ఎక్కువ ప్రాపర్టీలు కొనొద్దని నిపుణులు సూచిస్తున్నారు. ద్రవ్యోల్బణం ప్రభావం లేని అసెట్స్‌లో ఇన్వెస్ట్ చేయాలని, మల్టిపుల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలంటున్నారు. ఏటా మీ పోర్ట్‌ఫోలియో చెక్ చేసుకొని సవరించుకోవాలని చెబుతున్నారు.
News March 13, 2026
ఈరోజు నమాజ్ వేళలు (13-3-2026) శుక్రవారం

♦︎ సెహర్: తెల్లవారుజామున 5.14 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.22 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.26 గంటలకు
♦︎ అసర్: మధ్యాహ్నం 3.49 గంటలకు
♦︎ ఇఫ్తార్: సాయంత్రం 6.26 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.38 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.


