News February 18, 2025
ఎస్సీ వర్గీకరణ కమిషన్ కాలపరిమితి పెంపు

TG: ఎస్సీ వర్గీకరణ కమిషన్ కాలపరిమితిని మరో నెల రోజులు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 10తో జస్టిస్ షమీమ్ అక్తర్ కమిషన్ గడువు ముగియగా, మార్చి 10 వరకు పొడిగించింది. దీంతో వర్గీకరణపై ప్రభుత్వం మరేమైనా నిర్ణయాలు తీసుకుంటుందా? అనేది ఆసక్తిగా మారింది.
Similar News
News November 20, 2025
రూ.50లక్షలతో తీస్తే రూ.60కోట్లు వచ్చాయి!

కంటెంట్ నచ్చితే ప్రేక్షకులు సినిమాను గెలిపిస్తారని గుజరాతీ ఫిల్మ్ ‘లాలో: కృష్ణ సదా సహాయతే’తో మరోసారి రుజువైంది. కేవలం రూ.50లక్షలతో తీసిన ఈ సినిమా తొలుత తడబడినా.. కథపై మౌత్ టాక్ పెరిగి ఇప్పటికే రూ.60కోట్ల కలెక్షన్లు రాబట్టింది. ‘లాలో’ అనే రిక్షా డ్రైవర్ చుట్టూ ఈ కథ సాగుతుంది. ఈ చిత్రాన్ని అంకిత్ సఖియా తెరకెక్కించగా కరణ్ జోషి ప్రధాన పాత్రలో నటించారు. ఈచిత్రం గత నెల 10న థియేటర్లలో విడుదలైంది.
News November 20, 2025
ఆరేళ్ల వయసుకే NGO స్థాపించి..

మణిపూర్కు చెందిన లిసిప్రియా కంగుజాం 2011లో జన్మించింది. ఆరేళ్ళ వయసులో చైల్డ్ మూవ్మెంట్ అనే సంస్థను స్థాపించి, క్లైమేట్ చేంజ్పై పోరాటం మొదలుపెట్టింది. లిసిప్రియా 2019లో యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్లో మాట్లాడి అందర్నీ ఆకర్షించింది. ఆమె పోరాటానికి గుర్తింపుగా 2019లో డాక్టర్ APJ అబ్దుల్ కలాం చిల్డ్రన్స్ అవార్డ్, 2020లో గ్లోబల్ చైల్డ్ ప్రొడిజీ అవార్డ్లు అందుకుంది.
News November 20, 2025
KTR ప్రాసిక్యూషన్కు అనుమతి.. రేవంత్ ఏం చేస్తారో చూడాలి: సంజయ్

TG: రాష్ట్రంలో RK (రేవంత్, కేటీఆర్) పాలన నడుస్తోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో KTR ప్రాసిక్యూషన్కు గవర్నర్ అనుమతి ఇవ్వడంపై ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఇంతకాలం కేటీఆర్ విచారణకు గవర్నర్ అనుమతి ఇవ్వడం లేదని కేంద్రాన్ని టార్గెట్ చేశారు. ఇప్పుడు సీఎం రేవంత్ ఏం చేస్తారో, ఏం చెప్తారో చూడాలి. వాళ్లిద్దరి దోస్తానా ఇప్పుడు బయటపడుతుంది’ అని వ్యాఖ్యానించారు.


