News February 18, 2025

ఎస్సీ వర్గీకరణ కమిషన్ కాలపరిమితి పెంపు

image

TG: ఎస్సీ వర్గీకరణ కమిషన్ కాలపరిమితిని మరో నెల రోజులు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 10తో జస్టిస్ షమీమ్ అక్తర్ కమిషన్ గడువు ముగియగా, మార్చి 10 వరకు పొడిగించింది. దీంతో వర్గీకరణపై ప్రభుత్వం మరేమైనా నిర్ణయాలు తీసుకుంటుందా? అనేది ఆసక్తిగా మారింది.

Similar News

News March 27, 2025

ఫొగట్‌కు 3 ఛాయిస్‌లిచ్చిన హరియాణా ప్రభుత్వం!

image

భారత మాజీ రెజ్లర్, కాంగ్రెస్ MLA వినేశ్ ఫొగట్‌కు క్రీడా విధానం కింద ఇచ్చే ప్రయోజనాలను హరియాణా ప్రభుత్వం వెల్లడించింది. మంత్రివర్గ సమావేశం అనంతరం ఆమె ఎమ్మెల్యే కావడంతో 3 ఛాయిస్‌లు ఇస్తున్నట్లు పేర్కొంది. రూ.4కోట్ల నగదు, హరియాణా షహ్రీ వికాస్ ప్రాధికార్ (HSVP) కింద ప్లాట్ లేదా గ్రూప్-A ఉద్యోగంలో ఏదైనా ఒకటి ఇస్తామంది. అయితే ఈ మూడింటిలో ఏది కావాలో చెప్పాలని కోరగా, ఆమె నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు.

News March 27, 2025

ఇంట్లో ఒకే బిడ్డ ఉంటే..!

image

తోబుట్టువులు లేకుండా పెరిగే పిల్లల్లో చాలా మంది ‘ఓన్లీ చైల్డ్ సిండ్రోమ్’ బారిన పడుతున్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. ఇలాంటి వారు సొంత అవసరాలు, కోరికలపై ఎక్కువ దృష్టి పెట్టడంతో స్వార్థపరులుగా మారుతారు. ఇంట్లో ఒంటరితనాన్ని అనుభవించడంతో ఇతరులతో త్వరగా కలిసిపోలేరు. బాల్యమంతా ఏకాంతాన్ని అనుభవిస్తారు. షేరింగ్, అండర్‌స్టాడింగ్, సాల్వింగ్ వంటివి నేర్చుకోవడంలో వెనకబడతారు. పేరెంట్స్‌పై ఎక్కువ ఆధారపడతారు.

News March 27, 2025

కరుణ్ నాయర్‌కు BCCI నుంచి పిలుపు?

image

విదర్భ కెప్టెన్ కరుణ్ నాయర్‌ టెస్టుల్లో రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్‌తో జరగబోయే టెస్టు సిరీస్‌కు BCCI ఆయనను ఎంపిక చేయనున్నట్లు సమాచారం. అంతకు ముందు ఇండియా-A జట్టులో ఆయనకు చోటు కల్పిస్తారని వార్తలు వస్తున్నాయి. కరుణ్ కొద్దిరోజులుగా దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్నారు. విజయ్ హజారే ట్రోఫీలో 5, SMATలో 3 సెంచరీలు బాదారు. దీంతో ఆయనను జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్లు పెరిగాయి.

error: Content is protected !!