News April 14, 2025
SC వర్గీకరణ: 59 కులాల విభజన ఇలా..

TG: రాష్ట్రంలో 59 కులాలను 3 గ్రూపులుగా విభజించింది. గ్రూప్-1లో సామాజిక, ఆర్థిక, విద్యాపరంగా వెనుకబడిన 15 కులాలను చేర్చి 1 శాతం రిజర్వేషన్ కల్పించింది. గ్రూప్-2లో మాదిగ, దాని ఉపకులాల(18)కు 9 శాతం, గ్రూప్-3లో మాల, దాని ఉపకులాల(26)కు 5శాతం కేటాయించింది. గ్రూప్-1లో 1,71,625 మంది(3.288 శాతం), గ్రూప్-2లో 32,74,377(62.749 శాతం) మంది, గ్రూప్-3లో 17,71,682(33.963 శాతం) మంది ఉన్నారు.
Similar News
News December 15, 2025
క్యాబేజీలో రెక్కల పురుగు నివారణకు సూచనలు

క్యాబేజీలో రెక్కల పురుగు లార్వాలు ఆకుల అడుగు భాగాన చేరి తినడం వల్ల ఆకులు వాడి ఎండిపోతాయి. వీటి ఉద్ధృతి ఎక్కువైతే ఆకులకు రంధ్రాలు పడి క్యాబేజీ పరిమాణం తగ్గుతుంది. దీని నివారణకు ప్రతి 25 క్యాబేజీ వరుసలకు 2 వరుసల ఆవ మొక్కలను ఎర పంటగా నాటాలి. రెక్కల పురుగు గుడ్లను నాశనం చేసేందుకు 5% వేపగింజల ద్రావణాన్ని, ఉద్ధృతి మరీ ఎక్కువైతే లీటరు నీటికి నోవాల్యురాన్1ml కలిపి కోతకు 15 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి.
News December 15, 2025
లిక్కర్ స్కామ్ కేసు: SC విచారణ జనవరి 21కి వాయిదా

ఏపీ అక్రమ మద్యం కేసులో గోవిందప్ప, ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లను SC విచారించింది. వారికి సరెండర్ నుంచి ఇచ్చిన మినహాయింపును జనవరి 21 వరకు పొడిగించి తదుపరి విచారణను అదే తేదీకి వాయిదా వేసింది. ఈమేరకు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం ఆదేశాలు జారీచేసింది. ట్రయల్ కోర్టు ఛార్జిషీట్ను కాగ్నిజెన్స్లోకి తీసుకునేందుకు తమ ఉత్తర్వులు అడ్డంకి కాబోవని స్పష్టం చేసింది.
News December 15, 2025
మెస్సీతో హ్యాండ్షేక్ కోసం రూ.కోటి!

‘గోట్ టూర్’లో భాగంగా అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సీ ఇవాళ ఢిల్లీలో పర్యటించనున్నారు. చాణక్యపురిలోని ప్రఖ్యాత లీలా ప్యాలెస్లో బస చేయనున్నారు. అక్కడ ఎంపిక చేసిన VIPలు, అతిథులకు మెస్సీతో క్లోజ్డ్ డోర్ ‘మీట్ అండ్ గ్రీట్’ ఏర్పాటు చేశారు. ఇందులో మెస్సీని కలిసి మాట్లాడేందుకు కొందరు కార్పొరేట్లు ₹కోట్లు కుమ్మరిస్తున్నట్లు సమాచారం. షేక్ హ్యాండ్ కోసమే ₹కోటి చెల్లించుకుంటున్నట్లు జాతీయ మీడియా చెబుతోంది.


