News April 14, 2025

SC వర్గీకరణ: 59 కులాల విభజన ఇలా..

image

TG: రాష్ట్రంలో 59 కులాలను 3 గ్రూపులుగా విభజించింది. గ్రూప్-1లో సామాజిక, ఆర్థిక, విద్యాపరంగా వెనుకబడిన 15 కులాలను చేర్చి 1 శాతం రిజర్వేషన్ కల్పించింది. గ్రూప్-2లో మాదిగ, దాని ఉపకులాల(18)కు 9 శాతం, గ్రూప్-3లో మాల, దాని ఉపకులాల(26)కు 5శాతం కేటాయించింది. గ్రూప్-1లో 1,71,625 మంది(3.288 శాతం), గ్రూప్-2లో 32,74,377(62.749 శాతం) మంది, గ్రూప్-3లో 17,71,682(33.963 శాతం) మంది ఉన్నారు.

Similar News

News January 18, 2026

HYDలో ఫిబ్రవరి 10 డెడ్‌లైన్

image

మేయర్, పాలకమండలి గడువు ఫిబ్రవరి 10, 2026తో ముగియనుంది. అప్పటివరకు విలీన మున్సిపాలిటీలు స్పెషల్ ఆఫీసర్ల కింద ఉండనుండగా ఫిబ్రవరి 11 నుంచి గ్రేటర్ వ్యవస్థలో సమూల మార్పులు రానున్నాయి. మార్చి నాటికి డివిజన్ల వారీ ఫైనల్ రిజర్వేషన్ గెజిట్ విడుదల చేసి, ఏప్రిల్‌లో ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చేలా షెడ్యూల్ సిద్ధమవుతోంది. మున్సిపల్ శాఖ ఇప్పటికే జలమండలి, రెవెన్యూ విభాగాలను దీనికి <<18882564>>అనుగుణంగా<<>> సిద్ధం చేస్తోంది.

News January 18, 2026

నేషనల్ టెస్ట్ హౌస్‌లో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

<>నేషనల్ టెస్ట్ హౌస్‌<<>>లో 25 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి MSc(కెమిస్ట్రీ, బయో కెమిస్ట్రీ, మైక్రో బయాలజీ, ఫుడ్ టెక్నాలజీ, ఫుడ్& న్యూట్రీషన్, డెయిరీ టెక్నాలజీ), MBA, PG మాస్ కమ్యూనికేషన్, BE/ B.Tech ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. Sr.యంగ్ ప్రొఫెషనల్‌కు నెలకు రూ.70k, Jr.యంగ్ ప్రొఫెషనల్‌కు రూ.40k చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://nth.gov.in

News January 18, 2026

నేడు ఈ పనులు చేస్తే కష్టాలు తప్పవు: పండితులు

image

చొల్లంగి అమావాస్య పర్వదినాన మనసును, శరీరాన్ని నిర్మలంగా ఉంచుకోవాలని పండితులు సూచిస్తున్నారు. అమావాస్య తిథి ముగిసే వరకు మద్యం, మాంసాహారాలకు దూరం ఉండాలని అంటున్నారు. ‘ఇది పితృదేవతలు మన ఇంటికి వచ్చే సమయం కావున ఎవర్నీ దూషించకూడదు. ఇంట్లో గొడవలు పడకూడదు. శుభకార్యాల చర్చలు, కొత్త వస్తువుల కొనుగోలు చేయకపోవడం ఉత్తమం. గోర్లు, జుట్టు కత్తిరించొద్దు. దైవ చింతనలో గడపాలి’ అని వారి సూచన.