News August 22, 2024
బెంగాల్ ప్రభుత్వ తీరుపై SC అసంతృప్తి

ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసు నమోదు చేసిన సమయాన్ని బెంగాల్ ప్రభుత్వం చెప్పలేకపోతోందని సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కేసు నమోదు చేయకముందే పోస్టుమార్టం నిర్వహించారా? అని ప్రశ్నించింది. అసహజ మరణంగా ఎప్పుడు నమోదు చేశారో చెప్పాలని కేసు ఎంట్రీ చేసిన అధికారిని ఆదేశించింది. ఇటువంటి రాష్ట్ర ప్రభుత్వ తీరును తన 30 ఏళ్ల సర్వీసులో ఎన్నడూ చూడలేదని జస్టిస్ పార్దివాలా వ్యాఖ్యానించారు.
Similar News
News July 10, 2025
విజయసాయి రెడ్డికి మరోసారి సిట్ నోటీసులు

AP: లిక్కర్ స్కాం కేసులో మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి సిట్ మరోసారి నోటీసులు ఇచ్చింది. ఈ నెల 12న ఉదయం 10 గంటలకు విచారణకు రావాలని అందులో పేర్కొంది. కాగా ఈ కేసులో ఇప్పటికే విజయసాయి ఒకసారి విచారణకు హాజరయ్యారు.
News July 10, 2025
కష్టపడుతున్న భారత బౌలర్లు

భారత్‌తో మూడో టెస్టులో ఫస్ట్ సెషన్లో కాస్త తడబడ్డ ఇంగ్లండ్ రెండో సెషన్లో ఆధిపత్యం చెలాయించింది. టీ విరామం సమయానికి ఆ జట్టు 2 వికెట్లకు 153 రన్స్ చేసింది. రూట్ 54*, పోప్ 44* రన్స్‌తో క్రీజులో నిలదొక్కుకున్నారు. 44 రన్స్‌కే ఇద్దరు ఇంగ్లిష్ బ్యాటర్ల వికెట్లు తీసిన నితీశ్ భారత్‌కు మంచి ఓపెనింగ్ ఇచ్చారు. అయితే మిగతా బౌలర్లు బుమ్రా, సిరాజ్, ఆకాశ్ ప్రభావం చూపలేకపోయారు.
News July 10, 2025
తొలి క్వార్టర్: TCSకు రూ.12,760 కోట్ల లాభం

2025-26 ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్లో భారత టెక్ దిగ్గజం TCS రూ.12,760 కోట్ల నెట్ ప్రాఫిట్ నమోదు చేసింది. గతేడాది ఇదే పీరియడ్(రూ.12,040 కోట్లు)తో పోలిస్తే లాభం 6 శాతం పెరిగింది. మరోవైపు ఆదాయం రూ.62,613 కోట్ల నుంచి రూ.63,437 కోట్లకు చేరింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 0.30% పెరిగి 24.5%కు ఎగిసింది. కాగా ఒక్కో షేరుకు రూ.11 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ను కంపెనీ డిక్లేర్ చేసింది.