News August 22, 2024

బెంగాల్ ప్రభుత్వ తీరుపై SC అసంతృప్తి

image

ట్రైనీ డాక్ట‌ర్ హ‌త్యాచారం కేసు నమోదు చేసిన సమయాన్ని బెంగాల్ ప్రభుత్వం చెప్పలేకపోతోందని సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కేసు న‌మోదు చేయ‌క‌ముందే పోస్టుమార్టం నిర్వ‌హించారా? అని ప్ర‌శ్నించింది. అస‌హ‌జ మ‌రణంగా ఎప్పుడు న‌మోదు చేశారో చెప్పాలని కేసు ఎంట్రీ చేసిన అధికారిని ఆదేశించింది. ఇటువంటి రాష్ట్ర ప్ర‌భుత్వ తీరును త‌న 30 ఏళ్ల స‌ర్వీసులో ఎన్నడూ చూడ‌లేద‌ని జ‌స్టిస్ పార్దివాలా వ్యాఖ్యానించారు.

Similar News

News September 10, 2024

రూ.10 కోట్ల విరాళం ఇచ్చిన ఏపీ విద్యుత్ ఉద్యోగులు

image

AP: వరద సహాయక చర్యల కోసం విద్యుత్ ఉద్యోగులు ఒక రోజు జీతాన్ని విరాళం ఇచ్చారు. రూ.10.60 కోట్లను సీఎం చంద్రబాబుకు అందజేశారు. వరదల్లో విద్యుత్ ఉద్యోగులు కష్టపడి పనిచేశారని, ఇప్పుడు ఒక రోజు జీతాన్ని సాయం చేశారని మంత్రి గొట్టిపాటి రవి కొనియాడారు. జెమినీ ఎడిబుల్ ఆయిల్స్ రూ.2 కోట్లు, సీల్ సెమ్‌కార్ప్ థర్మల్ ప్రాజెక్టు రూ.50 లక్షలు, ఇతర పామాయిల్ పారిశ్రామిక వేత్తలు రూ.50 లక్షలు సీఎం సహాయనిధికి అందజేశారు.

News September 10, 2024

విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

image

సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి(72) ఆరోగ్యం విషమంగా ఉందని ఆ పార్టీ ప్రకటించింది. ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ రావడంతో ఆయన ఆగస్టు 19న ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. పరిస్థితి విషమించడంతో ఆయనకు వైద్యులు ICUలో చికిత్స అందిస్తున్నారు. ఆయన చికిత్సకు స్పందిస్తున్నారని ఇటీవల సీపీఎం ప్రకటించింది. తాజాగా మళ్లీ విషమంగా మారింది.

News September 10, 2024

ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ ప్రారంభం

image

AP: ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియను జలవనరుల శాఖ ప్రారంభించింది. 50 టన్నుల బరువు ఎత్తే కెపాసిటీ ఉన్న 2 క్రేన్లతో పనులు చేపట్టింది. ఈనెల 1న ఎగువ నుంచి కొట్టుకువచ్చిన 4 పడవలు 67, 68, 69 గేట్ల వద్ద చిక్కుకోగా, అవి ఢీకొని బ్యారేజ్ కౌంటర్ వెయిట్లు ధ్వంసమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం 2,09,937 క్యూసెక్కుల వరద దిగువకు ప్రవహిస్తుండగా, 68, 69 గేట్లను క్లోజ్ చేసి పనులు జరిపిస్తున్నారు.