News November 21, 2024

PM కిసాన్, PM ఆవాస్ పేరుతో మోసాలు

image

TG: PM కిసాన్, PM ఆవాస్ యోజన పేరుతో వచ్చే SMSలను నమ్మవద్దని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కోరింది. సైబర్ నేరగాళ్లు ఈ పథకాల పేర్లతో నకిలీ SMSలు పంపి మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించింది. APK ఫైల్స్ పంపి, వాటి ద్వారా పథకంలో చేరాలని చెబితే ఆ లింక్స్ క్లిక్ చేయవద్దని సూచించింది. తెలియని వ్యక్తుల నుంచి APK ఫైల్స్ వస్తే ఓపెన్ చేయవద్దని హెచ్చరించింది. అనుమానం వస్తే 1930కి కాల్ చేయాలంది.

Similar News

News November 21, 2024

అదానీపై కేసు: కాంగ్రెస్‌పై BJP విమర్శలు

image

NYC కోర్టులో అదానీపై అభియోగాలు నమోదైన నేపథ్యంలో ‘మోదానీ స్కామ్’లపై JPC వేయాలన్న జైరామ్ రమేశ్, కాంగ్రెస్‌పై BJP విరుచుకుపడింది. నేర నిరూపణ జరిగేంతవరకు ఆరోపణలు ఎదుర్కొంటున్నవాళ్లు నిర్దోషులేనని మీరు షేర్‌చేసిన పత్రాల్లోనే రాసుండటం చూడలేదా అని అమిత్ మాలవీయ కౌంటర్ ఇచ్చారు. అందులో ఆరోపించిన రాష్ట్రాలన్నీ కాంగ్రెస్, ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలేనన్నారు. ముందు మీరు తీసుకున్న లంచాలకు బదులివ్వాలన్నారు.

News November 21, 2024

శాసనమండలిలో గందరగోళం

image

AP శాసనమండలిలో మెడికల్ కాలేజీల అంశంపై YCP, కూటమి సభ్యుల మధ్య రగడ నెలకొంది. మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధమా? అన్న YCP ప్రశ్నకు మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పందిస్తూ వంద ఎలుకలు తిన్న పిల్లి హజ్ యాత్రకు వెళ్లినట్లు ఆ పార్టీ మాట్లాడుతోందని వ్యాఖ్యానించారు. దీంతో హజ్ యాత్రను ప్రస్తావించడంపై YCP అభ్యంతరం వ్యక్తం చేసింది. తోటి మంత్రులంతా ఆయన వ్యాఖ్యల్లో తప్పేం లేదంటూ మద్దతుగా నిలిచారు.

News November 21, 2024

తెలుగు హీరోలను ఎంకరేజ్ చేయండి: బ్రహ్మాజీ

image

ప్రతి శుక్రవారం లానే రేపు ముగ్గురు తెలుగు హీరోల సినిమాలు రిలీజ్ కానున్నాయి. గల్లా అశోక్ ‘దేవకీ నందన వాసుదేవ’, విశ్వక్ సేన్ ‘మెకానిక్ రాకీ’, సత్యదేవ్ నటించిన ‘జీబ్రా’ మూవీలు రేపు థియేటర్లలో విడుదల కానున్నాయి. ఈక్రమంలో నటుడు బ్రహ్మాజీ ప్రేక్షకులకు ఓ విజ్ఞప్తి చేశారు. ‘మలయాళం, తమిళ హీరోలతో పాటు మన టాలెంటెడ్ తెలుగు హీరోలను కూడా ఎంకరేజ్ చేయండి’ అని ట్వీట్ చేశారు. మరి మీరు ఏ మూవీకి వెళ్తున్నారు?