News November 26, 2024
ఏపీలో 3 రాజ్యసభ స్థానాలకు షెడ్యూల్ విడుదల
ఏపీలో ఖాళీగా ఉన్న 3 రాజ్యసభ స్థానాల ఉపఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. డిసెంబర్ 3న నోటిఫికేషన్ విడుదల కానుండగా, ఆ రోజు నుంచి 10వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు డిసెంబర్ 13తో ముగియనుంది. డిసెంబర్ 20న పోలింగ్, అదే రోజు కౌంటింగ్ జరగనుంది. మోపిదేవి, బీద మస్తాన్, ఆర్.కృష్ణయ్య రాజీనామాలతో 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ అయిన సంగతి తెలిసిందే.
Similar News
News November 26, 2024
ఢిల్లీలో నివసించే ప్రతి ఒక్కరి ఊపిరితిత్తులు నాశనం: పరిశోధకులు
ఢిల్లీలో కాలుష్యం అతి తీవ్ర స్థాయికి చేరుకున్న నేపథ్యంలో అక్కడి పౌరుల ఊపిరితిత్తులు కచ్చితంగా ఎంతోకొంతమేర నాశనం అయి ఉంటాయని అశోక యూనివర్సిటీ డీన్, పరిశోధకుడు అనురాగ్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఈ స్థాయి కాలుష్యం వలన ఆరోగ్యవంతుల లంగ్స్ కూడా ఇప్పటికే నాశనమవడం ప్రారంభమై ఉంటుంది. ఆల్రెడీ ఆస్తమా, ఇన్ఫెక్షన్లున్నవారి సమస్యలైతే వర్ణనాతీతంగా ఉంటాయి. ఈ కాలుష్యం ఎవర్నీ వదిలిపెట్టదు’ అని హెచ్చరించారు.
News November 26, 2024
ఈవీఎంలకు వ్యతిరేకంగా దాఖలైన పిల్ కొట్టేసిన సుప్రీం
ఈవీఎంలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈవీఎంలు ట్యాంపరింగ్కు గురవుతున్నాయని, బ్యాలెట్ విధానం మళ్లీ ప్రవేశపెట్టాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఈ పిటిషన్ వేశారు. పిటిషనర్ వాదనలో బలమైన కారణం లేదని అభిప్రాయపడిన న్యాయస్థానం పిటిషన్ను కొట్టేసింది.
News November 26, 2024
రాహుల్ పౌరసత్వం రద్దు ఫిర్యాదులపై చర్యలు ప్రారంభించాం: కేంద్రం
రాహుల్ గాంధీ భారత పౌరసత్వం రద్దుకు సంబంధించి హోం శాఖకు ఫిర్యాదులు అందాయని అలహాబాద్ హైకోర్టుకు కేంద్రం తెలిపింది. ఈ విషయమై చర్యలు ప్రారంభించినట్టు వెల్లడించింది. రాహుల్కు బ్రిటిష్ పౌరసత్వం ఉందని, ఆయన భారత పౌరసత్వం రద్దుకు CBI దర్యాప్తు కోరుతూ కర్ణాటక BJP నేత విఘ్నేశ్ కోర్టును ఆశ్రయించారు. డిసెంబర్ 19న జరిగే తదుపరి విచారణలో ఫిర్యాదులపై తీసుకున్న చర్యలు వెల్లడించాలని కోర్టు ఆదేశించింది.