News November 26, 2024

ఏపీలో 3 రాజ్యసభ స్థానాలకు షెడ్యూల్ విడుదల

image

ఏపీలో ఖాళీగా ఉన్న 3 రాజ్యసభ స్థానాల ఉపఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. డిసెంబర్ 3న నోటిఫికేషన్ విడుదల కానుండగా, ఆ రోజు నుంచి 10వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు డిసెంబర్ 13తో ముగియనుంది. డిసెంబర్ 20న పోలింగ్, అదే రోజు కౌంటింగ్ జరగనుంది. మోపిదేవి, బీద మస్తాన్, ఆర్.కృష్ణయ్య రాజీనామాలతో 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ అయిన సంగతి తెలిసిందే.

Similar News

News December 9, 2024

రష్యా చేరుకున్న సిరియా అధ్యక్షుడు

image

సిరియా రాజధాని డమాస్కస్‌ను రెబల్స్ ఆక్రమించుకోవడంతో ఆ దేశ అధ్యక్షుడు అసద్‌ దేశాన్ని వీడారు. కాగా, ఆయన విమానాన్ని రెబల్స్ కూల్చేశారనే వార్తల నేపథ్యంలో అంతర్జాతీయ మీడియా సంస్థలు స్పష్టత ఇచ్చాయి. కుటుంబంతో సహా అసద్ రష్యా చేరుకున్నట్లు తెలిపాయి. వారి కుటుంబానికి మానవతా కోణంలో రష్యా ఆశ్రయం కల్పించినట్లు వివరించాయి. తిరుగుబాటు దళాలతో చర్చల అనంతరం అసద్ సిరియాను వీడారని ఇప్పటికే రష్యా తెలిపింది.

News December 9, 2024

తెలంగాణలో భారీ పెట్టుబడులు

image

TG: రాష్ట్రంలో రూ.1,500కోట్ల పెట్టుబడులకు Lenskartతో ఎంవోయూ చేసుకున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఆ కంపెనీ కళ్లద్దాల పరికరాలకు సంబంధించిన ప్రపంచంలోనే అతిపెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ తెలంగాణలో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అక్కడ కళ్లద్దాలు, లెన్స్, సన్ గ్లాసెస్ తదితర వస్తువులు ఉత్పత్తి అవుతాయన్నారు. ఈ ప్లాంట్ ఏర్పాటు వల్ల దాదాపు 2100 మందికి ఉద్యోగాలు వస్తాయని ‘X’లో వెల్లడించారు.

News December 9, 2024

భూఅక్రమాల్లో ఎక్కడ చూసినా YCP నేతలే: హోంమంత్రి

image

AP: కాకినాడ పోర్టు వ్యవహారంలో అన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయని హోంమంత్రి అనిత అన్నారు. బియ్యం అక్రమ రవాణా మీద CIDతో దర్యాప్తు చేస్తున్నామని వివరించారు. ఎక్కడ భూ అక్రమాలు చూసినా YCP నేతల పాత్ర ఉందని ఆరోపించారు. విశాఖలో మాజీ MP ఎంవీవీ సత్యనారాయణ అక్రమాలు బయటికొచ్చాయన్నారు. గంజాయి‌పై ఉక్కుపాదం మోపామని, ఈగల్ వ్యవస్థ అప్పుడే పని మొదలుపెట్టిందని హోంమంత్రి విశాఖలో వెల్లడించారు.