News October 1, 2024
రేపటి నుంచి స్కూళ్లకు సెలవు

తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి స్కూళ్లకు దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. రేపు గాంధీ జయంతి కాగా, ఈ నెల 13 వరకు ఏపీలో సెలవులు ఉంటాయి. తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 14 వరకు సెలవులు ప్రకటించింది. దీంతో HYD, ఇతర పట్టణాల నుంచి సొంతూళ్లకు పిల్లలతో కలిసి పేరెంట్స్ పయనమవుతున్నారు. కాగా ప్రైవేటు యాజమాన్యాలు సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
Similar News
News March 12, 2026
‘జన నాయగన్’కు చిక్కులు.. ఓటీటీ డీల్ రద్దు?

సెన్సార్ వివాదంతో <<19146694>>వాయిదా పడుతున్న<<>> ‘జన నాయగన్’ మూవీకి మరో షాక్ తగిలినట్లు తెలుస్తోంది. ఓటీటీ డీల్‌ను అమెజాన్ ప్రైమ్ రద్దు చేసుకుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. రూ.120 కోట్లకు అగ్రిమెంట్ కుదుర్చుకోగా CBFC సర్టిఫికేషన్ విషయంలో వివాదాలు, చెప్పిన సమయానికి మూవీ విడుదల కాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాయి. కాగా ముందుగా నిర్ణయించిన దాని ప్రకారం గత సంక్రాంతికి ఈ మూవీ విడుదల కావాల్సి ఉంది.
News March 12, 2026
కూతురికి గన్ ఫైరింగ్ నేర్పిస్తున్న కిమ్

గన్‌తో ఫైరింగ్ ఎలా చేయాలో తన కూతురికి దగ్గరుండి నేర్పిస్తున్నారు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్. తన కుమార్తె కిమ్ జూ ఏతో కలిసి ఆయన ఇవాళ ఆయుధ కర్మాగారాన్ని సందర్శించారు. గురిచూసి కాలుస్తున్న వీరిద్దరి ఫొటోలను అక్కడి మీడియా విడుదల చేసింది. ప్రతి ఈవెంట్‌కు తనతో పాటు తీసుకెళ్లడం, దగ్గరుండి షూటింగ్ నేర్పిస్తుండటంతో తదుపరి వారసురాలిగా కిమ్ జూ ఏను ఆయన సిద్ధం చేస్తున్నారనే ప్రచారం బలపడుతోంది.
News March 12, 2026
నానుడి.. ‘ధృతరాష్ట్ర కౌగిలి’ అంటే ఏమిటి?

పైకి ప్రేమ నటిస్తూ లోపల ద్వేషంతో అవతలి వ్యక్తిని నాశనం చేయాలని ఇచ్చే కౌగిలింతను ‘ధృతరాష్ట్ర కౌగిలి’ అంటారు. భారతంలో ధృతరాష్ట్రుడు పుట్టుగుడ్డి అయినా బలవంతుడు. కురుక్షేత్ర యుద్ధం తర్వాత ఆశీర్వాదం కోసం పాండవులు వస్తారు. తన 100 మంది కొడుకులనూ చంపిన భీముడిని నలిపి చంపాలని ఆయన ప్రయత్నించగా కృష్ణుడు ఇనుప విగ్రహాన్ని ఉంచి కాపాడతారు. మీ జీవితంలో ధృతరాష్ట్ర కౌగిలి ఇచ్చేవారెవరో కామెంట్.
<<-se>>#EPICSAYINGS<<>>


