News June 11, 2024

రేపటి నుంచి స్కూళ్లు.. టైమింగ్స్ ఇవే

image

TG: వేసవి సెలవుల అనంతరం రేపటి నుంచి రాష్ట్రంలో స్కూళ్లు పున:ప్రారంభం కానున్నాయి. ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రాథమిక, ప్రాథమికోన్నత <<13317050>>స్కూళ్లు<<>> ఉ.9 గంటలకే ప్రారంభం కానున్నాయి. ప్రాథమిక పాఠశాలలు సా.4 గంటల వరకు, ప్రాథమికోన్నత పాఠశాలలు సా.4.15 గంటల వరకు నిర్వహిస్తారు. హైస్కూళ్లు మాత్రం ఉ.9.30 గంటల నుంచి ప్రారంభం అవుతాయి. HYD, SECలో మాత్రం ఉ.8.45 నుంచి సా.3.45 వరకే స్కూళ్లు ఉంటాయి.

Similar News

News December 5, 2025

అఖండ-2పై లేటెస్ట్ అప్‌డేట్

image

ఫైనాన్స్, లీగల్ ఇష్యూలతో అఖండ-2 సినిమా వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే ఓ డిస్ట్రిబ్యూటర్ ఫైనాన్షియర్లకు ఇవ్వాల్సిన బకాయిలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారని సినీవర్గాలు వెల్లడించాయి. అలాగే బాలకృష్ణ, బోయపాటి తమ రెమ్యునరేషన్‌లో కొంతభాగం వదులుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు తమకు రావాల్సిన రూ.28 కోట్లు+వడ్డీలో ఇప్పటికిప్పుడు 50% చెల్లించాలని <<18465729>>ఈరోస్<<>> డిమాండ్ చేస్తోందట. దీనిపై ఇవాళ కోర్టులో విచారణ జరగనుంది.

News December 5, 2025

763 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

image

DRDO ఆధ్వర్యంలోని సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్‌మెంట్( CEPTAM) 763 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-B పోస్టులు 561, టెక్నీషియన్-A పోస్టులు 203 ఉన్నాయి. అభ్యర్థుల వయసు 18 – 28 ఏళ్ల మధ్య ఉండాలి. డిసెంబర్ 9 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. వెబ్‌సైట్: https://www.drdo.gov.in *మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం కోసం<<-se_10012>> జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.

News December 5, 2025

విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్‌లో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

ఇస్రో-<>విక్రమ్<<>> సారాభాయ్ స్పేస్ సెంటర్‌లో 5 పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టును బట్టి ఎంబీబీఎస్, బీడీఎస్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. chsshelp@vssc.gov.in ఈ మెయిల్ ద్వారా అప్లై చేసుకోవాలి. వెబ్‌సైట్: www.vssc.gov.in