News June 11, 2024
రేపటి నుంచి స్కూళ్లు.. టైమింగ్స్ ఇవే

TG: వేసవి సెలవుల అనంతరం రేపటి నుంచి రాష్ట్రంలో స్కూళ్లు పున:ప్రారంభం కానున్నాయి. ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రాథమిక, ప్రాథమికోన్నత <<13317050>>స్కూళ్లు<<>> ఉ.9 గంటలకే ప్రారంభం కానున్నాయి. ప్రాథమిక పాఠశాలలు సా.4 గంటల వరకు, ప్రాథమికోన్నత పాఠశాలలు సా.4.15 గంటల వరకు నిర్వహిస్తారు. హైస్కూళ్లు మాత్రం ఉ.9.30 గంటల నుంచి ప్రారంభం అవుతాయి. HYD, SECలో మాత్రం ఉ.8.45 నుంచి సా.3.45 వరకే స్కూళ్లు ఉంటాయి.
Similar News
News March 21, 2025
పచ్చళ్లు అతిగా తింటే క్యాన్సర్ రావొచ్చు!

అతిగా పచ్చళ్లు తినడం ప్రమాదకరమని ప్రముఖ వైద్యుడు శ్రీకాంత్ పేర్కొన్నారు. ‘పచ్చళ్ళలో పెరిగే శిలీంధ్రాలు (బూజు/ఫంగస్) నైట్రేట్లని నైట్రైట్లుగా మారుస్తాయి. ఇవి క్యాన్సర్ కారకాలు. అప్పుడప్పుడూ తిన్నవారిని ఇవేం చేయలేవు. కానీ, అదేపనిగా తింటే గ్యాస్ట్రిక్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. దీనిపై కచ్చితమైన ఆధారాలు లేనప్పటికీ ఇది ప్రమాదకరమే. నిలువ పచ్చళ్ల కంటే అప్పుడే చేసిన రోటి పచ్చళ్లు సేఫ్’ అని తెలిపారు.
News March 21, 2025
రెండేళ్ల తర్వాత రూపాయికి బెస్ట్ వీక్ ఇదే

భారత రూపాయి అదరగొట్టింది. డాలర్‌తో పోలిస్తే ఈ రెండేళ్లలో ఈ వారమే అత్యధికంగా ఎగిసింది. 1.2 శాతానికి పైగా బలపడింది. నేడు ఏకంగా 39 పైసలు బలపడి 85.97 వద్ద స్థిరపడింది. డాలర్ ఇండెక్స్ పతనమవ్వడం, ఫారెక్స్ మార్కెట్లో జోక్యంతో పాటు లిక్విడిటీకి RBI మద్దతివ్వడం, ఫారిన్ ఇన్వెస్టర్లు తిరిగి పెట్టుబడులు పెడుతుండటం, ట్రేడ్ డెఫిసిట్ తగ్గడం, మొత్తం సర్‌ప్లస్ $4.5 బిలియన్లకు చేరడమే ఇందుకు కారణాలు.
News March 21, 2025
సీఎంతో హరీశ్, పద్మారావు భేటీ

TG: అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీశ్ రావు, పద్మారావు భేటీ అయ్యారు. అసెంబ్లీలోని సీఎం ఛాంబర్‌లో 15 నిమిషాల పాటు పలు అంశాలపై చర్చించారు. నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ పాటించడం లేదని సీఎంకు వారు ఫిర్యాదు చేశారు.