News March 3, 2025
ఇవాళ ఆ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

TG: MLC ఎన్నికలు జరిగిన ఉమ్మడి మెదక్, కరీంనగర్, ADB, నిజామాబాద్, NLG, WGL, ఖమ్మం జిల్లాల్లో ఇవాళ కౌంటింగ్ జరగనుంది. దీంతో ఆయా జిల్లాల్లోని స్కూళ్లు, కాలేజీలకు సెలవు ఇవ్వాలని ప్రభుత్వం ఇటీవల ఆదేశించింది. పలుచోట్ల సెలవు ఇవ్వలేదని విద్యార్థులు, పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. అటు ఏపీలో అవసరమైతేనే సెలవు ఇవ్వాలని EC ఆదేశించింది. దీంతో కౌంటింగ్ జరిగే చోటే సెలవు ఉండే ఛాన్సుంది.
Similar News
News March 27, 2025
కిలో రూ.3.. కష్టాల్లో టమాటా రైతులు

TG: గిట్టుబాటు ధరలు లేక, కిలో టమాటా రూ.3కే అమ్ముకోవాల్సిన పరిస్థితి రావడంతో రైతులు కంటతడి పెడుతున్నారు. రంగారెడ్డి (D) కొందుర్గ్ (M) రైతు నర్సింహులు 56 టమాటా పెట్టెలు(ఒక్కోదాంట్లో 30kg) మహబూబ్‌నగర్ రైతుబజారుకు తీసుకెళ్లారు. 39పెట్టెలకు దళారులు రూ.3,500 చెల్లించారు. మిగతావి కొనకపోవడంతో టమాటాలను రోడ్డుపక్కన పారబోస్తూ ఆవేదన చెందారు. మరోవైపు, బహిరంగ మార్కెట్లో కిలో టమాటా రూ.10- రూ.20 వరకు ఉంది.
News March 27, 2025
‘తెలుగు నేర్చుకో..’ అక్బరుద్దీన్ ఒవైసీపై మాజీ ఐఏఎస్ ఫైర్

TG: ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే <<15896404>>అక్బరుద్దీన్‌పై<<>> మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళీ ఫైరయ్యారు. ‘మంత్రి సీతక్కకు హిందీ రాదు సరే.. హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగిన నీకు తెలుగు ఎందుకు రాదు?’ అని ప్రశ్నించారు. రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు మాట్లాడే తొలి అధికార భాష తెలుగును నేర్చుకోవాలనే బాధ్యత ఉండాలని హితవు పలికారు. తెలుగు రానప్పుడు సభ్యులు లేవనెత్తే సమస్యలు ఎలా అర్థమవుతాయని దుయ్యబట్టారు.
News March 27, 2025
విక్రమ్ ‘వీర ధీర శూర’కు లైన్ క్లియర్

అనివార్య కారణాలతో ఇవాళ మార్నింగ్ షోలు రద్దయిన ‘వీర ధీర శూర’ చిత్రానికి ఊరట లభించింది. ఈవినింగ్ షో నుంచి సినిమా ప్రదర్శన ఉంటుందని తెలుగు డిస్ట్రిబ్యూటర్ మైత్రీ మూవీ మేకర్స్ ట్వీట్ చేసింది. ఇప్పటికే రద్దైన షోలకు డబ్బులు తిరిగిస్తామని సినీ ప్రేక్షకులకు థియేటర్ల యాజమాన్యాలు తెలిపాయి. అరుణ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విక్రమ్, దుషారా విజయన్ , ఎస్జే సూర్య ప్రధాన పాత్రల్లో నటించారు.