News March 16, 2024
SDNR: రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ మాజీ ఉద్యోగి మృతి

షాద్ నగర్ పట్టణ సమీపంలోని రాయికల్ టోల్ ప్లాజా సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పట్టణానికి చెందిన ఆర్టీసీ మాజీ ఉద్యోగి, కార్మిక నాయకుడు బిజీ రెడ్డి దుర్మరణం చెందారు. వాహనం నడుపుకుంటూ వచ్చిన ఆయన అదుపుతప్పి కింద పడడంతో తలకు బలమైన గాయమై మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. దీంతో ఆర్టీసీ కాలనీలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ సంఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News November 13, 2025
MBNR: U-14 క్రికెట్.. 150 మంది హాజరు

మహబూబ్ నగర్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) ఆధ్వర్యంలో అండర్-14 విభాగంలో బాలురకు క్రికెట్ ఎంపికలు MDCA స్టేడియంలో నిర్వహించారు. SGF కార్యదర్శి డాక్టర్ ఆర్.శారదాబాయి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మొత్తం 150 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఎంపికైనా వారిని ఈ నెల 15న నారాయణపేటలో జరిగే ఎంపికలలో పంపిస్తామన్నారు. పీడీలు వేణుగోపాల్, అబ్దుల్లా, మోహినుద్దీన్, పరశురాములు తదితరులు పాల్గొన్నారు.
News November 13, 2025
పాలమూరు: జాబ్ మేళా..70 మంది హాజరు

మహబూబ్ నగర్లోని జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం (పిల్లలమర్రి)లో ఇవాళ మినీ జాబ్ మేళా నిర్వహించామని జిల్లా ఉపాధి కల్పన అధికారిణి మైత్రిప్రియ Way2Newsతో తెలిపారు. 5 ప్రైవేట్ సంస్థలలో మొత్తం 385 ఉద్యోగ ఖాళీల కోసం వివిధ జిల్లాల నుంచి దాదాపుగా 70 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. వారిలో షార్ట్ లిస్టు తీసి.. అర్హులైన విద్యార్థులకు ఆఫర్ లెటర్ అందించినట్లు పేర్కొన్నారు.
News November 13, 2025
మహబూబ్నగర్లో పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. పెరిగిన చలి తీవ్రత

మహబూబ్నగర్ జిల్లాలో నాలుగు రోజులుగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో చలి తీవ్రత పెరిగింది. మిడ్జిల్ (దోనూరు)లో 12.7 డిగ్రీలు, గండీడ్ (సల్కర్పేట)లో 13.5 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. చలి కారణంగా రైతులు, కార్మికులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తీవ్ర చలి ప్రభావంతో పాల దిగుబడి తగ్గిందని రైతులు తెలిపారు.


