News March 16, 2024
SDNR: రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ మాజీ ఉద్యోగి మృతి
షాద్ నగర్ పట్టణ సమీపంలోని రాయికల్ టోల్ ప్లాజా సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పట్టణానికి చెందిన ఆర్టీసీ మాజీ ఉద్యోగి, కార్మిక నాయకుడు బిజీ రెడ్డి దుర్మరణం చెందారు. వాహనం నడుపుకుంటూ వచ్చిన ఆయన అదుపుతప్పి కింద పడడంతో తలకు బలమైన గాయమై మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. దీంతో ఆర్టీసీ కాలనీలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ సంఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News December 10, 2024
NRPT: ధరణి పెండింగ్ దరఖాస్తులు పూర్తిచేయాలి: అదనపు కలెక్టర్
పెండింగ్లో ఉన్న ధరణి దరఖాస్తులు వెంటనే పూర్తిచేయాలని అదనపు కలెక్టర్ బెన్ శాలం తహశీల్దార్లను ఆదేశించారు. మంగళవారం నారాయణపేట కలెక్టరేట్‌లో జిల్లాలోని తహశీల్దార్లతో సమావేశం నిర్వహించారు. పెండింగ్లో ఉన్న ధరణి దరఖాస్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ధరణి దరఖాస్తుల పరిష్కారానికి అవసరమైతే క్షేత్రస్థాయికి వెళ్లి విచారించాలన్నారు.
News December 10, 2024
MBNR: GOOD NEWS.. ఉచిత శిక్షణ, భోజనం
ఉమ్మడి పాలమూరు జిల్లా యువకులకు ఎలక్ట్రిషన్(హౌస్ వైరింగ్)లో ఉచిత శిక్షణ,భోజనం,వసతి కల్పిస్తున్నట్లు ఎస్బwఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ(SBRSETI) డైరెక్టర్ జి.శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం Way2Newsతో ఆయన మాట్లాడుతూ.. వచ్చే నెల 9లోపు దరఖాస్తు చేసుకోవాలని,19-45 సం|| వయస్సు ఉన్నవారు అర్హులని, మిగతా వివరాలకు 95424 30607, 99633 69361కు సంప్రదించాలని, ఆసక్తి గల యువకులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News December 10, 2024
MBNR: తగ్గుతున్న అమ్మాయిల జననాలు!
ఉమ్మడి పాలమూరు జిల్లాలో గత 3ఏళ్లుగా జననాల రేటులో అబ్బాయిల కంటే అమ్మాయిల సంఖ్య రోజురోజుకు తగ్గుతుంది. గత ఏడాదిలో బాలురు 28,891 జననాలు నమోదు కాగా.. అమ్మాయిలు 25,822 మంది మాత్రమే ఉన్నారు. పలు స్కానింగ్ కేంద్రాల్లో బేబీ జెండర్ గురించి చెప్తున్నట్లు సమాచారం. ఇలాగైతే బాలికల శాతం తగ్గనుంది. బాలికల కోసం సంక్షేమ పథకాలను అవగాహన కల్పిస్తూ.. స్కానింగ్ కేంద్రాలు తనిఖీలు చేస్తున్నామని DMHO అధికారులు తెలిపారు.