News August 11, 2024
అదానీపై సెబీ దర్యాప్తు: కాంగ్రెస్ డిమాండ్ ఇదే
అదానీ గ్రూపుపై సెబీ దర్యాప్తులో పరస్పర విరుద్ధ ప్రయోజనాలను తొలగించాలని కేంద్రాన్ని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. JPC ద్వారానే స్కామ్‌ను పూర్తిగా దర్యాప్తు చేయొచ్చని తెలిపింది. అంతిమ ప్రయోజనం పొందే ఫారిన్ ఫండ్స్ యజమాని ఎవరో తెలిపే ప్రక్రియను సెబీ 2019లో రద్దు చేయడాన్ని SC కమిటీ గుర్తించినట్టు పేర్కొంది. పార్లమెంటును రెండ్రోజుల ముందే నిరవధిక వాయిదా ఎందుకేశారో ఇప్పుడు అర్థమవుతోందని సెటైర్ వేసింది.
Similar News
News September 8, 2024
YCP శ్రేణుల ఫైర్.. ట్వీట్ డిలీట్ చేసిన బ్రహ్మాజీ
మాజీ CM జగన్‌పై సెటైరికల్ ట్వీట్ చేసిన <<14048027>>బ్రహ్మాజీపై<<>> YCP శ్రేణులు సోషల్ మీడియాలో ఫైరయ్యాయి. అధికారంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా జగన్‌నే విమర్శించడం కొందరికి ఫ్యాషన్ అయిపోయిందని మండిపడ్డాయి. వరద సహాయక చర్యల్లో లోపాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మీకెందుకు కోపం వచ్చిందని నిలదీశాయి. రూ.కోటితోపాటు YCP ప్రజాప్రతినిధులు నెల జీతాన్ని కేటాయించడం కనిపించలేదా? అని దుయ్యబట్టాయి. దీంతో ఆయన ట్వీట్ డిలీట్ చేశారు.
News September 8, 2024
ఆధార్ కార్డుల జారీపై అస్సాం ప్రభుత్వం కీలక నిర్ణయం
రాష్ట్రంలో అక్రమ వలసలను అడ్డుకునేందుకు ఆధార్ కార్డుల జారీ విషయంలో అస్సాం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్ కార్డు కావాలంటే తప్పనిసరిగా NRC నంబర్‌ను సమర్పించాలని సీఎం హిమంత బిశ్వ శర్మ స్పష్టం చేశారు. అక్టోబర్ 1 నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుందన్నారు. రాష్ట్ర జనాభా కంటే ఆధార్ కార్డుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు గుర్తించామన్నారు.
News September 8, 2024
నేటితో ముగియనున్న పారిస్ పారాలింపిక్స్
పారిస్ పారాలింపిక్స్ నేటితో ముగియనున్నాయి. ఆగస్టు 28న ప్రారంభమైన ఈ పోటీలు 11 రోజులపాటు కొనసాగాయి. 216 పతకాలతో చైనా అగ్రస్థానంలో కొనసాగుతోంది. భారత్ 29 పతకాలతో 16వ ప్లేస్‌లో ఉంది. మొత్తం 4,463 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. 22 క్రీడల్లో 549 విభాగాల్లో పోటీలు జరిగాయి. ఇండియా నుంచి 84 మంది అథ్లెట్లు పారాలింపిక్స్‌లో పాల్గొన్నారు. 25 పతకాలు సాధించాలనే లక్ష్యాన్ని మన దేశం నెరవేర్చుకుంది.