News June 3, 2024
ISIకి రహస్య సమాచారం.. ‘బ్రహ్మోస్’ మాజీ ఇంజినీర్‌కు జీవితఖైదు
బ్రహ్మోస్ ఏరోస్పేస్ మాజీ ఇంజినీర్ నిషాంత్ అగర్వాల్‌కు నాగ్‌పూర్ కోర్టు జీవితఖైదు విధించింది. పాకిస్థాన్ ISIకి రహస్య సమాచారం చేరవేశారనే కేసులో అతడు దోషిగా తేలాడు. దీంతో కోర్టు నిషాంత్‌కు అధికారిక రహస్యాల చట్టం కింద మరో 14 ఏళ్ల జైలుశిక్షతో పాటు రూ.3000 ఫైన్ వేసింది. నాగ్‌పూర్‌లోని మిస్సైల్ సెక్షన్‌లో టెక్నికల్ రీసెర్చ్ సెంటర్‌లో ఇంజినీర్‌గా పనిచేసే నిషాంత్‌ను ATS అధికారులు 2018లో అరెస్ట్ చేశారు.
Similar News
News September 19, 2024
కౌలు రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్
AP: కౌలు రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భూయజమాని సంతకం లేకుండానే వచ్చే రబీ నాటికి కౌలు కార్డులను ఇవ్వాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించింది. దీనివల్ల కౌలు రైతులకు బ్యాంకుల ద్వారా పంట రుణాలు ఇప్పించడం, ప్రభుత్వ సబ్సిడీలు, పరిహారాలు అందించడం మరింత సులువవుతుంది. అదే సమయంలో రైతుల భూమి హక్కులకు నష్టం కలగకుండా చర్యలు తీసుకోనుంది. వారిలో ఉన్న అపోహలు తొలగించనుంది.
News September 19, 2024
జమిలితో ప్రాంతీయ పార్టీలకు దెబ్బేనా?
జమిలి ఎన్నికలతో తమకు నష్టం కలుగుతుందని పలు ప్రాంతీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దేశభద్రత, విదేశాంగ విధానం లాంటి జాతీయ అంశాల ఆధారంగా ప్రజలు అసెంబ్లీకీ ఓటు వేసే అవకాశం ఉందంటున్నాయి. స్థానిక సమస్యలు మరుగున పడటంతో పాటు ప్రాంతీయ పార్టీలు నష్టపోయి, జాతీయ పార్టీలకు మేలు కలుగుతుందని చెబుతున్నాయి. జమిలి ఎన్నికలు నిర్వహిస్తే 77% మంది ప్రజలు ఒకే పార్టీని ఎన్నుకునే అవకాశముందని ఓ సర్వేలో తేలింది.
News September 19, 2024
ఇలా చేస్తున్నారా..? పళ్లు అరిగిపోతాయి!
తెల్లటి పలువరస కోసం చాలామంది ఎక్కువ సేపు బ్రష్ చేసుకుంటుంటారు. మరి కొంతమంది బలంగా తోముతారు. ఇవేవీ మంచివి కావంటున్నారు వైద్య నిపుణులు. ఇలా బ్రష్ చేస్తే పంటిపై ఉండే ఎనామిల్ పొర తొలగిపోతుంది. పళ్లు సెన్సిటివ్‌గా మారి జివ్వుమని లాగుతుంటాయి. అందుకే కేవలం 2, 3 నిమిషాల్లోనే బ్రషింగ్ ముగించాలని వైద్యులు చెబుతున్నారు. ఇక నిద్ర లేచాక, నిద్రపోయే ముందు బ్రష్ చేస్తే పళ్లు ఆరోగ్యంగా ఉంటాయని సూచిస్తున్నారు.