News August 18, 2024

చివరి వరకూ రహస్యంగానే(2/2)

image

ఎమిలీ ఓ భారతీయుడి వద్ద పని చేయడం ఆమె పేరెంట్స్‌కు ఇష్టం లేదు. అయితే బోస్‌ను కలిసిన తర్వాత వారు తమ అభిప్రాయం మార్చుకున్నారు. ఇక ఎమిలీతో ప్రేమలో ఉన్న సుభాష్ చంద్రబోస్ ఆమెకు తరచూ ప్రేమ లేఖలు రాస్తుండేవారు. వీరి వివాహం 1937 డిసెంబర్ 27న ఆస్ట్రియాలో జరిగింది. వీరికి ఓ కూతురు అనితా బోస్ ఫాఫ్. విదేశీ వనితను పెళ్లాడారన్న ఇమేజ్ ఆయనపై ప్రభావం చూపే అవకాశం ఉందని వివాహాన్ని వారు చివరి వరకూ రహస్యంగానే ఉంచారు.

Similar News

News December 10, 2025

కేతకీ పుష్పాన్ని పూజలో ఎందుకు వినియోగించరు?

image

శివ పూజలో కేతకీ పుష్పం వాడరన్న విషయం తెలిసిందే! శివుని జ్యోతిస్తంభం ఆది, అంతాలను కనుగొన్నానని బ్రహ్మ అబద్ధం చెప్పడానికి ఈ పుష్పాన్నే సాక్ష్యంగా చూపాడట. అది అబద్ధపు సాక్ష్యమని గ్రహించిన శివుడు తన పూజలో ఈ పుష్పాన్ని వాడొద్దని శపించాడు. అందుకే శివపూజలో మొగలి పువ్వును వాడరు. అయినప్పటికీ శివ భక్తులు దీనిని తలలో ధరించవచ్చని, పూజా ప్రాంగణంలో అలంకారం కోసం ఉపయోగించవచ్చని పురోహితులు సూచిస్తున్నారు.

News December 10, 2025

శరీరంలో ఈ మార్పులు వస్తే జాగ్రత్త!

image

చాలా మంది కిడ్నీ సమస్యలను త్వరగా గుర్తించకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వైద్యులు చెబుతున్నారు. శరీరంలో వచ్చే కొన్ని మార్పులను గమనించి పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. తక్కువ లేదా రాత్రి వేళల్లో అతి మూత్రం, మూత్రంలో నురుగు/ఎర్రటి రంగు, ముఖం/పాదాలు లేదా శరీరం ఉబ్బినట్లు అనిపిస్తే జాగ్రత్త పడాలని హెచ్చరిస్తున్నారు. బీపీ పెరుగుతున్నా కిడ్నీ సమస్యలుగా గుర్తించాలని చెబుతున్నారు.

News December 10, 2025

నాగార్జున సాగర్@70ఏళ్లు

image

కృష్ణా నదిపై నిర్మించిన ఆనకట్టల్లో నాగార్జున సాగర్ అతి పెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్టు. దీనికి శంకుస్థాపన చేసి నేటికి 70 ఏళ్లు. 1955 DEC 10న ఆనాటి PM నెహ్రూ పునాది రాయి వేశారు. 1967లో ఇందిరా గాంధీ కుడి, ఎడమ కాలువల ద్వారా నీటిని విడుదల చేశారు. 1911లోనే నిజాం ఈ ప్రాంతంలో ఆనకట్ట కట్టాలని అనుకున్నా కార్యరూపం దాల్చలేదు. సాగర్ నుంచి ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, కృష్ణా, గుంటూరు జిల్లాలకు సాగునీరు అందుతోంది.