News August 18, 2024
చివరి వరకూ రహస్యంగానే(2/2)

ఎమిలీ ఓ భారతీయుడి వద్ద పని చేయడం ఆమె పేరెంట్స్‌కు ఇష్టం లేదు. అయితే బోస్‌ను కలిసిన తర్వాత వారు తమ అభిప్రాయం మార్చుకున్నారు. ఇక ఎమిలీతో ప్రేమలో ఉన్న సుభాష్ చంద్రబోస్ ఆమెకు తరచూ ప్రేమ లేఖలు రాస్తుండేవారు. వీరి వివాహం 1937 డిసెంబర్ 27న ఆస్ట్రియాలో జరిగింది. వీరికి ఓ కూతురు అనితా బోస్ ఫాఫ్. విదేశీ వనితను పెళ్లాడారన్న ఇమేజ్ ఆయనపై ప్రభావం చూపే అవకాశం ఉందని వివాహాన్ని వారు చివరి వరకూ రహస్యంగానే ఉంచారు.
Similar News
News February 11, 2025
రాహుల్ తెలంగాణ పర్యటన రద్దు

TG: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన రద్దయింది. ఈ సాయంత్రం ఆయన హనుమకొండ రావాల్సి ఉండగా అనివార్య కారణాలతో పర్యటనను రద్దు చేసుకున్నారు.
News February 11, 2025
Stock Markets Crash: Rs10లక్షల కోట్ల నష్టం

దేశీయ స్టాక్‌మార్కెట్లు రక్తమోడుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి నెగటివ్ సంకేతాలు రావడం, డాలర్ పెరుగుదల, ట్రంప్ ఆంక్షల దెబ్బకు సూచీలు కుదేలయ్యాయి. నిఫ్టీ 330 పాయింట్లు నష్టపోయి 23,048, సెన్సెక్స్ 1074 పాయింట్లు ఎరుపెక్కి 76,223 వద్ద ట్రేడవుతున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు ఈ ఒక్కరోజే రూ.10లక్షల కోట్ల మేర సంపదను కోల్పోయారు. అదానీ ఎంటర్‌ప్రైజెస్, గ్రాసిమ్ మినహా నిఫ్టీలో అన్ని షేర్లూ క్రాష్ అయ్యాయి.
News February 11, 2025
దేవుడి పేరుతో దాడులు దురదృష్టకరం: మంత్రి

TG: వీర రాఘవరెడ్డి, అతడి అనుచరుల దాడిలో గాయపడ్డ చిలుకూరు ఆలయ అర్చకుడు రంగరాజన్‌ను మంత్రి శ్రీధర్ బాబు పరామర్శించారు. దాడి ఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. దేవుడి పేరు మీద దాడులు చేయడం దురదృష్టకరమన్నారు. నిందితుల్లో ఇప్పటికే కొందరిని అరెస్టు చేశామని, ఆలయం వద్ద భద్రత పెంచుతామని చెప్పారు. అటు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్, ఇతర నేతలు సైతం రంగరాజన్‌కు ఫోన్ చేసి పరామర్శించారు.