News December 19, 2024
కేటీఆర్‌పై నమోదైన సెక్షన్లు.. వివరాలు
KTRపై అవినీతి <<14924408>>నిరోధక<<>> చట్టంలోని 13(1)(ఏ), 13(2), BNSలోని 409, 120(బీ) సెక్షన్ల కింద కేసు నమోదైంది. 13(1)(ఏ): ప్రజాప్రతినిధి తన స్వప్రయోజనాల కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం లేదా తన అధీనంలోని వారికి లబ్ధి చేకూర్చడం. 13(2): ప్రజాప్రతినిధి నేరాలకు పాల్పడటం. 409: ఆస్తుల్ని సంరక్షించాల్సిన ప్రజాప్రతినిధి తనపై ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయడం, 120(B): చట్టవిరుద్ధమైన పని చేసేందుకు కుట్ర పన్నడం
Similar News
News January 23, 2025
స్విగ్గీ, జొమాటోకు షాకివ్వబోతున్న రెస్టారెంట్లు!
ప్రైవేటు లేబుల్ ఫుడ్ పేరుతో తమ వ్యాపారానికి కత్తెరేస్తున్న స్విగ్గీ, జొమాటోను నిలువరించేందుకు రెస్టారెంట్లు సిద్ధమవుతున్నాయి. కస్టమర్లకు ఫుడ్ డెలివరీ చేసేందుకు ONDC బాట పడుతున్నాయి. ఇప్పటికే గ్రౌండ్‌వర్క్ మొదలైందని NRAI తెలిపింది. దీంతో మళ్లీ తమ డిజిటల్ ఓనర్‌షిప్ పెరుగుతుందని, కస్టమర్ల డేటా యాక్సెస్‌కు వీలవుతుందని పేర్కొంది. తమపై కమీషన్, కస్టమర్లపై డెలివరీ ఛార్జీల భారం తగ్గుతుందని అంటోంది.
News January 23, 2025
భరతమాత ఓ హిందూ దేవత మాత్రమే: కర్ణాటక వర్సిటీ సిలబస్‌పై ఫైర్
కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో మరో వివాదం రాజుకుంది. దేశ సామరస్యాన్ని దెబ్బతీసే పాఠాలను KA యూనివర్సిటీ పుస్తకాల్లోంచి తొలగించాలని సామాజికవేత్తలు గవర్నర్ థావర్‌చంద్‌కు లేఖరాశారు. భరతమాత కేవలం హిందువుల దేవతని, అన్యమతాలకు సంబంధం లేదని పుస్తకాల్లో ఉన్నట్టు తెలిపారు. అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించకుండా ఉండాల్సిందని, RSS సమాజాన్ని విడదీస్తుందంటూ ముద్రించారని పేర్కొన్నారు. వీటిపై చర్యలు తీసుకోవాలన్నారు.
News January 23, 2025
నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
AP: అనంతపురం సమీపంలోని నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థి చరణ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఫస్ట్ ఇయర్ చదువుతున్న అతడు క్లాస్ జరుగుతుండగానే బయటికి వచ్చి మూడో అంతస్తు నుంచి దూకేశాడు. ఆసుపత్రికి తీసుకెళ్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. చరణ్ స్వస్థలం రామాపురంగా గుర్తించారు. ఇటీవల సంక్రాంతి సెలవులకు ఇంటికి వచ్చి వెళ్లిన చరణ్ ఇంతలోనే సూసైడ్ చేసుకోవడంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.