News March 13, 2025
దస్తగిరికి భద్రత పెంపు

AP: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యకేసులో అప్రూవర్ దస్తగిరికి ప్రభుత్వం భద్రత పెంచింది. గతంలో ఆయనకు 1+1 సెక్యూరిటీ ఉండగా ఇకపై 2+2కు గన్‌మెన్లను కేటాయించినట్లు ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. వివేకా హత్య కేసులో సాక్షులు అనుమానాస్పదంగా మృతి చెందుతున్న నేపథ్యంలో తనకు భద్రత కల్పించాలని ఆయన ఇటీవల విన్నవించారు. దీంతో సెక్యూరిటీ పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
Similar News
News March 23, 2025
నేడు రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ సన్నాహక సమావేశం

రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ సన్నాహాక సమావేశం ఆదివారం ఉదయం 10 గంటలకు ఆరంగర్‌లో ఉంటుందని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్ అన్నారు. ముఖ్య అతిథులుగా టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, జిల్లా ఇన్ఛార్జి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు హాజరవుతున్నారని చెప్పారు. కావున జిల్లా ప్రజా ప్రతినిధులు, కార్పొరేషన్ ఛైర్మన్లు, కాంగ్రెస్ అన్ని విభాగాల ప్రతినిధులు హాజరుకావాలని కోరారు.
News March 23, 2025
SLBC సహాయక చర్యలపై వివరాలు బయటపెట్టాలి: హరీశ్ రావు

TG: SLBC సొరంగం వద్ద ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలపై పూర్తి వివరాలు బయట పెట్టాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. ‘ఘటన జరిగి నెల రోజులైనా సొరంగంలో చిక్కుకున్నవారు ఏమయ్యారో ఇప్పటికీ తెలియని పరిస్థితి. ఒకరి మృతదేహం వెలికి తీయడం తప్ప, మిగతా ఏడుగురి జాడ కనుగొనడంలో ఎలాంటి పురోగతి లేకపోవడం శోచనీయం. భూ భౌతిక శాస్త్రవేత్తలు హెచ్చరించినా రాజకీయ ప్రయోజనాల కోసం టన్నెల్ పనులు ప్రారంభించారు’ అని ట్వీట్ చేశారు.
News March 23, 2025
RCB బౌలింగ్ బాగుందనడం సంతోషం: మాల్యా

IPL2025 తొలి మ్యాచులో KKRపై విజయం సాధించిన RCBకి ఆ టీమ్ మాజీ ఓనర్ విజయ్ మాల్యా X వేదికగా అభినందనలు తెలిపారు. ‘ఎట్టకేలకు ఆర్సీబీ బాగా బౌలింగ్ చేసిందని కామెంటేటర్స్ చెప్పడం సంతోషంగా ఉంది. ఇక ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. చూస్తే అర్థం అవుతోంది’ అని పేర్కొన్నారు. కాగా బ్యాంకులకు రుణాలు చెల్లించకుండా దేశం వదిలి పారిపోయిన మాల్యా ప్రస్తుతం UKలో నివసిస్తున్న సంగతి తెలిసిందే.