News November 30, 2024

ఇంద్రధనుస్సు రంగులో మొక్కజొన్నను చూశారా?

image

సాధారణంగా మొక్కజొన్న కంకులు పచ్చరంగులోనే ఎక్కువగా కనిపిస్తుంటాయి. అయితే, అమెరికాలో పండే హెర్లూమ్ మొక్కజొన్న ఇంద్రధనుస్సు రంగులతో ఎంతో బ్యూటిఫుల్‌గా ఉంటుంది. దీని ఫొటోలను నెటిజన్లు ట్వీట్స్ చేస్తూ ‘ఇంత అందంగా ఉంటే ఎలా తింటాము’ అని పోస్టులు పెడుతున్నారు. దీనిని అక్కడి ప్రజలు ‘ఇండియన్ కార్న్’ అని పిలుస్తుంటారు. కార్న్ లియోన్ బర్న్స్ అనే వ్యక్తి ఈ మొక్కజొన్నను సృష్టించారు.

Similar News

News February 16, 2026

జామలో కాయకుళ్లు తెగులు నివారణకు సూచనలు

image

జామ తోటల్లో పక్వానికి వచ్చిన పండ్లపై ఈ తెగులు ప్రభావం కనిపిస్తుంది. కాయకుళ్లు సోకిన జామ పండ్లపై గుండ్రటి గోధుమ రంగు మచ్చలు గుంటలు పడి కనిపిస్తాయి. గోధుమ మచ్చలపై గులాబీ రంగు మచ్చలు కూడా కనిపిస్తాయి. మచ్చలు ఏర్పడిన 3 నుంచి 4 రోజుల్లో పండు కుళ్లిపోతుంది. దీని నివారణకు కాయలు ఏర్పడే సమయంలో కాపర్ ఆక్సీక్లోరైడ్ లీటర్ నీటికి 4గ్రాముల చొప్పున 15 రోజుల వ్యవధిలో 2 నుంచి 3 సార్లు పిచికారీ చేసుకోవాలి.

News February 16, 2026

మేయర్, ఛైర్మన్ల ఎన్నిక ఇలా..

image

TG: ఇవాళ 7 కార్పొరేషన్ల మేయర్లు, 116 మున్సిపాలిటీల ఛైర్మన్ల ఎన్నిక జరగనుంది. ఉ.11 గంటలకు గెలిచినవారితో అధికారులు ప్రమాణం చేయిస్తారు. తర్వాత ఆయా పదవులకు నామినేషన్లు స్వీకరిస్తారు. మిగతా సభ్యులతో పాటు ఎక్స్ అఫీషియో సభ్యులు(MP,MLA,MLC) చేతులెత్తి మద్దతు తెలుపుతారు. 50 శాతానికిపైగా ఓట్లు వచ్చినవారిని విన్నర్‌గా ప్రకటిస్తారు. సమాన ఓట్లు వస్తే లాటరీ ద్వారా విజేతను నిర్ణయిస్తారు.

News February 16, 2026

2 అల్పపీడనాలు.. వర్ష సూచన!

image

దక్షిణ బంగాళాఖాతంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో తమిళనాడు, శ్రీలంకలో వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఈ నెల 19 తర్వాత ఉపరితల ఆవర్తనం ఏర్పడి, అల్పపీడనంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయని పేర్కొంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వానలు పడతాయని అంచనా వేసింది. ఈ నెల 25 నుంచి 28 వరకు తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.