News April 25, 2024
ముంబై కెప్టెన్‌కు సెహ్వాగ్ కీలక సూచనలు

ముంబై కెప్టెన్‌గా, ప్లేయర్‌గా విఫలమవుతున్న హార్దిక్ పాండ్యకు మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కీలక సూచనలు చేశారు. గత రెండు సీజన్ల నుంచి ముంబై ప్రదర్శన ఇలానే ఉందన్నారు. జట్టుగా ఆడితేనే ముంబైకి విజయాలు దక్కుతాయన్నారు. పాండ్య తన వ్యక్తిగత ప్రదర్శనను మెరుగుపర్చుకోవాలని సెహ్వాగ్ సూచించారు. బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు చేసుకొని ముందుగా బ్యాటింగ్‌కు రావాలన్నారు.
Similar News
News December 16, 2025
BHPL: మూడో విడత ‘ఖరీదైన‘ పంచాయతీ ఎన్నికలు!

జిల్లాలో మూడో విడత 78 పంచాయతీలలో ఎన్నికలు జరుగుతున్నాయి. అభ్యర్థుల ఖర్చు తడిసి ముద్దవుతోంది. ఎన్నికల ప్రకటన వెలువడినప్పటి నుంచి ప్రారంభమైన ఖర్చు నామినేషన్ల తర్వాత ఖర్చు లక్షల్లోకి పెరిగింది. నాలుగు మండలాల్లో పోలింగ్ బుధవారం జరుగుతోంది. పంచాయతీల్లో డబ్బు మద్యం ఏరులై పారుతోంది. కాళేశ్వరం, కాటారం, మహాదేవపుర్, గంగారం, మహాముత్తారం, శంకరంపల్లి ఆదివారంపేట, సూరారం, ధన్వాడ గ్రామాలు ప్రతిష్ఠాత్మకంగా మారాయి.
News December 16, 2025
స్పిన్నర్‌కు భారీ ధర

లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ జాక్‌పాట్ కొట్టారు. ఐపీఎల్ వేలంలో భారీ ధర పలికారు. రూ.2 కోట్ల బేస్ ప్రైస్‌తో ఆక్షన్‌లోకి వచ్చిన ఆయన్ను రూ.7.2 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది. ఇక ఫిన్ అలెన్(రూ.2 కోట్లు)ను కేకేఆర్, జేకబ్ డఫ్ఫీ(రూ.2 కోట్లు)ని ఆర్సీబీ, అకేల్ హోసేన్(రూ.2 కోట్లు)ను సీఎస్కే కొనుగోలు చేశాయి. ఇక అభినవ్ మనోహర్, తీక్షణ, మ్యాట్ హెన్రీ, జెమీ స్మిత్, గుర్బాజ్ అన్‌సోల్డ్‌గా మిగిలారు.
News December 16, 2025
పంచాయతీలకు ఫండ్స్ ఎవరి భిక్ష కాదు: కేటీఆర్

TG: పంచాయతీలకు ఫండ్స్ ఎవరి భిక్ష కాదని, అది రాజ్యాంగం వారికి ఇచ్చిన హక్కు అని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సొంత ఇళ్లు అమ్మి కాంగ్రెస్ నేతలు నిధులివ్వడం లేదని ఫైరయ్యారు. ప్రజలను, ప్రజాప్రతినిధులను చంపేస్తామని బరితెగించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఖానాపూర్, షాద్‌నగర్ నియోజకవర్గాల్లో కొత్తగా ఎన్నికైన సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు మెంబర్లను తెలంగాణ భవన్‌లో ఇవాళ కేటీఆర్ సన్మానించారు.


