News May 18, 2024

పట్టుబడ్డ ఎన్నికల సొత్తు విలువ రూ.8,889 కోట్లు: ఈసీ

image

ఇప్పటివరకు పట్టుకున్న ఎన్నికల నగదు, మద్యం, డ్రగ్స్, ఇతర వస్తువుల విలువ రూ.8,889 కోట్లు ఉంటుందని ఎన్నికల కమిషన్ తెలిపింది. ఇది ఎన్నికలు ముగిసే నాటికి మరింత పెరగొచ్చని అంచనా వేసింది. డ్రగ్స్, లిక్కర్ పట్టుకోవడంపై ఈ సారి ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొంది. 3 రోజుల్లో ATS, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఇండియన్ కోస్ట్ గార్డ్ కలిసి రూ.892 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు వివరించింది.

Similar News

News December 9, 2024

మంచు మనోజ్ కడుపు, వెన్నెముకకు గాయాలు

image

మంచు మనోజ్ శరీరంపై గాయాలున్నట్లు మెడికో లీగల్ రిపోర్టులో వెల్లడైంది. కడుపు, వెన్నెముక, ఎడమ కాలి పిక్క భాగంలో దెబ్బలు తగిలాయని, మెడపై గోళ్లతో రక్కిన ఆనవాళ్లున్నాయని తేలింది. కుటుంబ వివాదాల నేపథ్యంలో మనోజ్‌పై దాడి జరిగినట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. నిన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి భార్యతో కలిసి వచ్చిన ఆయన చికిత్స అనంతరం వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన మెడికల్ రిపోర్టు ఇవాళ బయటకు వచ్చింది.

News December 9, 2024

ప్రజలు, ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్న రేవంత్: హరీశ్ రావు

image

TG: రాష్ట్రంలో రేవంత్ రెడ్డి దుర్మార్గ, అరాచక పాలన సాగుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు మండిపడ్డారు. ర్యాలీగా అసెంబ్లీకి వెళ్తున్న తమను అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు, ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్‌పై కుట్రతోనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చారని ఆరోపించారు. ఆమె విగ్రహాన్ని మార్చాలని ఎవరైనా ఉద్యమాలు చేశారా? అని ప్రశ్నించారు.

News December 9, 2024

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై తొలి ప్రకటన వచ్చింది ఈరోజే

image

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై 2009లో సరిగ్గా ఇదే రోజు కేంద్రం నుంచి తొలి ప్రకటన వెలువడింది. నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన 11 రోజుల తర్వాత ఈ ప్రకటన రావడంతో బీఆర్ఎస్ ఈరోజును ఏటా ‘దీక్షా విజయ్ దివస్’‌గా నిర్వహిస్తోంది. ప్రజల పోరాటాన్ని చూసి చలించి ఈ ప్రకటన చేసినట్లు కాంగ్రెస్ చెబుతోంది. 2013 OCT3న కేంద్ర క్యాబినెట్ TG స్టేట్ ఏర్పాటుకు ఆమోదం తెలపగా, 2014 జూన్ 2న రాష్ట్రం అవతరించింది.