News April 28, 2024
రూ.600కోట్ల డ్రగ్స్ పట్టివేత.. 14 మంది అరెస్ట్

గుజరాత్ తీరంలో అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖకు సమీపంలో దాదాపు 90 కేజీల డ్రగ్స్‌ను ఇండియన్ కోస్ట్ గార్డ్ పట్టుకుంది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, గుజరాత్ ATSతో కలిసి సంయుక్త ఆపరేషన్ నిర్వహించింది. డ్రగ్స్‌ను తరలిస్తున్న 14 మంది పాకిస్థానీయులను అదుపులోకి తీసుకుంది. పట్టుబడిన డ్రగ్స్ విలువ ₹600కోట్లు ఉంటుందని సమాచారం. గత కొన్ని రోజులుగా ఈ ఆపరేషన్‌ను నిర్వహిస్తున్నామని అధికారులు తెలిపారు.
Similar News
News April 12, 2026
హార్ముజ్‌లో టెన్షన్.. పాక్ ట్యాంకర్ యూటర్న్

హార్ముజ్ జలసంధి దగ్గర హైడ్రామా చోటుచేసుకుంది. అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు విఫలం కావడంతో 2 భారీ ఆయిల్ ట్యాంకర్లు చివరి నిమిషంలో యూటర్న్ తీసుకున్నాయి. పాక్, ఇరాక్‌కు చెందిన ఈ నౌకలు ఒమన్ గల్ఫ్ నుంచి పర్షియన్ గల్ఫ్‌లోకి వెళ్లాల్సి ఉంది. కానీ ఇరాన్ దగ్గరకు రాగానే వెనక్కి వెళ్లాయి. నిజానికి పాక్, ఇరాక్ నౌకలకు తొలుత ఇరాన్ అనుమతి ఇచ్చింది. కానీ చర్చలు ఫెయిల్ కావటంతో ఈ పరిణామం చోటుచేసుకుంది.
News April 12, 2026
జులై 3 నుంచి అమర్‌నాథ్ యాత్ర

J&K అనంతనాగ్ జిల్లాలో గల అమర్‌నాథ్ యాత్ర జులై 3 నుంచి మొదలు కానుంది. 57 రోజుల పాటు జరిగే ఈ యాత్ర ఆగస్టు 28 న ముగియనున్నట్లు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తెలిపారు. శివుని ఆశీస్సులు కోరుతూ చేసే తొలి పూజను జూన్ 29న జ్యేష్ఠ పౌర్ణమి నాడు నిర్వహిస్తామన్నారు. ఈనెల 15 నుంచి <<19607867>>రిజిస్ట్రేషన్<<>> చేసుకోవచ్చు. 3,882 మీటర్ల ఎత్తులో ఉండే ఈ పుణ్యక్షేత్ర యాత్రకు మూడేళ్లలోపు, 70 ఏళ్లు పైబడినవారిని అనుమతించరు.
News April 12, 2026
ఏపీ ఇంటర్ ఫలితాలపై UPDATE

AP: ఇంటర్మీడియట్ ఫలితాల విడుదలపై ఇంటర్ బోర్డ్ అప్‌డేట్ ఇచ్చింది. ఈ నెల 19 (ఆదివారం) లోపు ఫలితాలు విడుదల చేస్తామని Way2Newsతో చెప్పింది. ఇప్పటికే మూల్యాంకనం పూర్తి కాగా విడుదలకు ప్రాసెస్ కొనసాగుతోందని తెలిపింది. కాగా ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24 వరకు జరిగిన ఈ పరీక్షలకు దాదాపు 10.50 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.


