News October 28, 2024
ఆస్ట్రేలియాతో సిరీస్‌కు ఎంపిక.. తెలుగు ప్లేయర్ కీలక వ్యాఖ్యలు
ఆస్ట్రేలియాపై ఆడాలన్నది తన చిన్నప్పటి కల అని తెలుగు ప్లేయర్ నితీశ్ కుమార్ రెడ్డి అన్నారు. దేశం తరఫున టెస్టులు ఆడే అవకాశం రావడం ఆనందంగా ఉందని చెప్పారు. ఆల్‌రౌండర్‌గా రాణిస్తాననే నమ్మకం ఉందన్నారు. AUSలోని పరిస్థితులపై తనకు అవగాహన ఉందని తెలిపారు. SRHకు కమిన్స్ సారథ్యంలో ఆడానని ఇప్పుడు ప్రత్యర్థిగా ఆడనున్నట్లు పేర్కొన్నారు. ఆస్ట్రేలియాతో జరిగే BGTకి నితీశ్ ఎంపికైన సంగతి తెలిసిందే.
Similar News
News November 12, 2024
అమృత్ టెండర్లలో అవినీతి పెద్ద జోక్: కోమటిరెడ్డి
TG: కేసుల నుంచి బయటపడేందుకే కేటీఆర్ ఢిల్లీ వెళ్లారని మంత్రి కోమటిరెడ్డి విమర్శించారు. అమృత్ టెండర్లలో అవినీతి జరిగిందనేది పెద్ద జోక్ అని చెప్పారు. ‘CM రేవంత్‌కు సృజన్ రెడ్డి తోకచుట్టం. కవిత, సృజన్ రెడ్డిలు వ్యాపార భాగస్వాములు. పాలమూరు టన్నెల్ పనులను వారిద్దరే చేశారు. దీనికి KTR సమాధానమివ్వాలి. అధికారులపై దాడులు, అమృత్ టెండర్లలో అవినీతి అని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు’ అని మంత్రి తెలిపారు.
News November 12, 2024
FLASH: హాల్‌టికెట్లు విడుదల
కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్(CHSL) టైర్-2 పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను SSC విడుదల చేసింది. అభ్యర్థులు <
News November 12, 2024
తెలంగాణ నుంచి మహారాష్ట్రకు డబ్బు వెళ్తోంది: KTR
TG: మహారాష్ట్రలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు డబ్బు తరలి వెళ్తోందని ఆరోపించారు. తెలంగాణ, మహారాష్ట్ర మధ్య ఈసీ సెక్యూరిటీ పెంచాలని కోరారు. రేవంత్ తన బావమరిదికి అమృతం ఇచ్చి, కొడంగల్ ఫార్మాతో ప్రజలకు విషం ఇస్తున్నారని మండిపడ్డారు. అమృత్ పథకంలో భారీ అవినీతి జరిగిందని, ప్రభుత్వ తప్పులను తరచూ ఢిల్లీకి వచ్చి ఎండగడతామన్నారు.