News August 9, 2024
నెలాఖరున పీసీసీ చీఫ్ ఎంపిక?

TG: ఈ నెల చివరి వారంలో రాష్ట్రానికి పీసీసీ అధ్యక్షుడిని నియమించనున్నట్లు తెలుస్తోంది. బీసీలకు ఇస్తే మహేశ్‌కుమార్ గౌడ్, మధుయాష్కీ గౌడ్, లంబాడాలకు ఇస్తే బలరాం నాయక్, ఎస్సీలకు కేటాయిస్తే సంపత్ కుమార్‌లలో ఎవరో ఒకరికి పీసీసీ పీఠం దక్కనున్నట్లు సమాచారం. ప్రచార కమిటీ ఛైర్మన్‌గా జగ్గారెడ్డి పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. అలాగే నలుగురు కార్యనిర్వాహక అధ్యక్షులను నియమించాలని ఏఐసీసీ భావిస్తున్నట్లు సమాచారం.
Similar News
News February 27, 2026
వాట్సాప్ వెబ్ డౌన్

వాట్సాప్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. తాము వాట్సాప్ వెబ్ యాక్సెస్ చేయలేకపోతున్నామని పలువురు యూజర్లు Xలో పోస్టులు పెడుతున్నారు. ఉదయం 9 గంటల నుంచి ఈ సమస్య ఎదురవుతోందని చెబుతున్నారు. అయితే ఐఫోన్ యూజర్లకే ఇష్యూ వస్తున్నట్లు మరికొందరు అంటున్నారు. మీకూ వాట్సాప్ వెబ్ యాక్సెస్ అవ్వడంలేదా? COMMENT
News February 27, 2026
డీఎంకేలో చేరిన మాజీ సీఎం పన్నీర్ సెల్వం

అసెంబ్లీ ఎన్నికల ముంగిట తమిళ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ సీఎం, అన్నాడీఎంకే బహిష్కృత నేత పన్నీర్ సెల్వం డీఎంకేలో చేరారు. ఆయనకు సీఎం ఎంకే స్టాలిన్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. కాగా డీఎంకే పాలన బాగుందని, మరోసారి ఆ పార్టీ అధికారం చేపట్టబోతోందని ఇటీవల OPS వ్యాఖ్యానించారు.
News February 27, 2026
రియల్ హీరో❤️ కుటుంబం కోసం వైకల్యంలోనూ!

వైకల్యాన్ని ఎదిరించి ముంబై వీధుల్లో సతీశ్ సాగిస్తున్న జీవన పోరాటం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం. పుట్టుకతోనే పోలియో వల్ల కాళ్లు పడిపోయినా చూపులేని తల్లిదండ్రుల బాధ్యతను ఆయన భుజాన వేసుకున్నారు. భార్య వీల్ ఛైర్ నెడుతుంటే రెండేళ్ల కొడుకును ఒడిలో కూర్చోబెట్టుకుని టిష్యూ పేపర్లు అమ్ముతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. వైకల్యమున్నా ఎవరిపై ఆధారపడకుండా కష్టపడుతున్న సతీశ్ రియల్ హీరో అని అంతా ప్రశంసిస్తున్నారు.


