News August 9, 2024

నెలాఖరున పీసీసీ చీఫ్ ఎంపిక?

image

TG: ఈ నెల చివరి వారంలో రాష్ట్రానికి పీసీసీ అధ్యక్షుడిని నియమించనున్నట్లు తెలుస్తోంది. బీసీలకు ఇస్తే మహేశ్‌కుమార్ గౌడ్, మధుయాష్కీ గౌడ్, లంబాడాలకు ఇస్తే బలరాం నాయక్, ఎస్సీలకు కేటాయిస్తే సంపత్ కుమార్‌లలో ఎవరో ఒకరికి పీసీసీ పీఠం దక్కనున్నట్లు సమాచారం. ప్రచార కమిటీ ఛైర్మన్‌గా జగ్గారెడ్డి పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. అలాగే నలుగురు కార్యనిర్వాహక అధ్యక్షులను నియమించాలని ఏఐసీసీ భావిస్తున్నట్లు సమాచారం.

Similar News

News September 16, 2024

బిగ్ బాస్-8: రెండోవారం షాకింగ్ ఎలిమినేషన్

image

తెలుగు బిగ్ బాస్-8 షో ఈ సారి అంచనాలకు అందకుండా సాగుతోంది. రెండో వారంలో శేఖర్ బాషా ఎలిమినేట్ అయ్యారని హోస్ట్ నాగార్జున తెలిపారు. నామినేషన్స్ ఫైనల్స్‌లో ఓం ఆదిత్య, బాషా మిగలగా ఇంటి సభ్యుల ఓటింగ్‌తో అతడిని ఎలిమినేట్ చేశారు. శేఖర్ ఎలిమినేట్ కావడంతో పలువురు హౌస్ సభ్యులు కంటతడి పెట్టుకున్నారు. ఈ సీజన్ మొదలైనప్పటి నుంచి హౌస్‌లో బాషా పంచ్‌లు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.

News September 16, 2024

BREAKING: రివర్స్ టెండరింగ్ విధానం రద్దు

image

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం తీసుకొచ్చిన రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేసింది. ఈ మేరకు జీవో జారీ చేసింది. మళ్లీ పాత టెండరింగ్ విధానాన్నే అమల్లోకి తెస్తున్నట్లు పేర్కొంది.

News September 16, 2024

ఎంబీబీఎస్ తొలి విడత కన్వీనర్ సీట్ల కేటాయింపు

image

AP: ఏపీలోని 35 మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా <>సీట్లను<<>> కేటాయిస్తూ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన యూనివర్సిటీ జాబితాను రిలీజ్ చేసింది. మొదటి విడత కౌన్సిలింగ్‌లో 3,612 సీట్లకుగానూ 3,507 సీట్లను కేటాయిస్తూ లిస్ట్‌లో పేర్కొంది. ఈ నెల 19 వరకు రిపోర్టింగ్‌కు అవకాశం కల్పించింది. క్లాసులు వచ్చే నెల 1 నుంచి ప్రారంభం కానున్నాయి. రెండో దశ కౌన్సెలింగ్‌లో ప్రత్యేక కేటగిరీ సీట్లను కేటాయించనున్నారు.