News November 21, 2024
జొమాటోలో డ్రగ్స్ అమ్మకం.? సంస్థ స్పందన ఇదే

జొమాటోలో కొన్ని రెస్టారెంట్లు ఫుడ్ ఐటెమ్స్ పేరిట మత్తు పదార్థాల్ని విక్రయిస్తున్నాయన్న ఆరోపణలపై జొమాటో తాజాగా స్పందించింది. ‘అలాంటి రెస్టారెంట్లను గుర్తించి ఇప్పటికే ఓ జాబితాను రూపొందించాం. వాటిని జొమాటో నుంచి తొలగిస్తున్నాం. మా యాప్‌లో రిజిస్టర్ అయ్యే అన్ని సంస్థలకూ FSSAI లైసెన్స్ ఉండాల్సిందే. మద్యం, సిగరెట్లు, వేప్స్ వంటివి విక్రయించేవారిని బ్లాక్ చేస్తున్నాం’ అని స్పష్టం చేసింది.
Similar News
News November 4, 2025
రాత్రంతా ఆలోచిస్తూ, ఒంటరిగా ఉంటూ.. మృత్యుంజయుడి ఆక్రందన!

అహ్మదాబాద్ విమాన ప్రమాదం నుంచి బయటపడిన <<16688689>>మృత్యుంజయుడు<<>> రమేశ్ మానసికంగా కుంగిపోతున్నాడు. ‘ప్రమాదంలో తమ్ముడిని కోల్పోయా. ఆ ఘటన పదే పదే గుర్తొస్తోంది. రాత్రంతా ఆలోచిస్తూ, మేలుకొనే ఉంటున్నా. ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతున్నా. నా భార్యతో, కొడుకుతోనూ మాట్లాడటం లేదు. మానసికంగా బాధపడుతున్నా. 4 నెలలుగా అమ్మ మాట్లాడట్లేదు’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.
News November 4, 2025
డిస్కంలకు రూ.2,635 కోట్లు విడుదల

AP: డిస్కంలకు చెల్లించాల్సిన టారిఫ్ సబ్సిడీ నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. 2025-26 మూడో త్రైమాసికానికి సంబంధించి రూ.2,635 కోట్లను రిలీజ్ చేసింది. హడ్కో నుంచి రూ.5వేల కోట్ల రుణం పొందేందుకు ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు హామీ ఇచ్చింది. విద్యుత్, బొగ్గు కొనుగోళ్లు, నిర్వహణ అవసరాలకు వెచ్చించాలని ఆదేశించింది.
News November 3, 2025
ఈ జిల్లాల్లో వర్షాలు

TG: రేపు ఉ.8.30 గంటల వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదిలాబాద్, యాదాద్రి, నిర్మల్, ఆసిఫాబాద్, నిజామాబాద్, జగిత్యాల, HYD, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, గద్వాల, వనపర్తి, నారాయణపేట జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.


