News November 21, 2024

జొమాటోలో డ్రగ్స్ అమ్మకం.? సంస్థ స్పందన ఇదే

image

జొమాటోలో కొన్ని రెస్టారెంట్లు ఫుడ్ ఐటెమ్స్ పేరిట మత్తు పదార్థాల్ని విక్రయిస్తున్నాయన్న ఆరోపణలపై జొమాటో తాజాగా స్పందించింది. ‘అలాంటి రెస్టారెంట్లను గుర్తించి ఇప్పటికే ఓ జాబితాను రూపొందించాం. వాటిని జొమాటో నుంచి తొలగిస్తున్నాం. మా యాప్‌లో రిజిస్టర్ అయ్యే అన్ని సంస్థలకూ FSSAI లైసెన్స్ ఉండాల్సిందే. మద్యం, సిగరెట్లు, వేప్స్ వంటివి విక్రయించేవారిని బ్లాక్ చేస్తున్నాం’ అని స్పష్టం చేసింది.

Similar News

News March 9, 2026

త్రిషకు సారీ చెప్పిన నటుడు పార్తీబన్

image

త్రిషను బయటకు రానివ్వకూడదంటూ తాను చేసిన <<19330179>>కామెంట్స్‌పై<<>> నటుడు, డైరెక్టర్ పార్తీబన్ విచారం వ్యక్తం చేశారు. ‘ఈవెంట్‌లో అంతా తప్పుగా జరిగింది. క్షమాపణ కోరడం తప్ప మరో మార్గం లేదు’ అని Xలో పోస్టు చేశారు. టీవీకే చీఫ్ విజయ్, త్రిష రిలేషన్ రూమర్స్ నేపథ్యంలో పార్తీబన్ చేసిన కామెంట్స్ వైరలైన విషయం తెలిసిందే. దీనిపై త్రిష కూడా <<19332584>>ఘాటుగా బదులివ్వడంతో<<>> ఆయన దిగి వచ్చారు.

News March 9, 2026

భారీ నష్టం తప్పదు.. ఇరాన్‌కు వార్నింగ్ ఇచ్చిన గల్ఫ్ దేశాలు

image

తమపై దాడులు చేస్తోన్న ఇరాన్‌పై గల్ఫ్ దేశాలు ఫైరవుతున్నాయి. అరబ్ దేశాలపై అటాక్స్ కొనసాగిస్తే టెహ్రాన్ భారీ నష్టాన్ని చవిచూస్తుందని సౌదీ హెచ్చరించింది. దీనివల్ల భవిష్యత్తులో ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం పడుతుందని తెలిపింది. అతి పెద్ద షైబా ఆయిల్ ఫీల్డ్‌పై దాడిని ఖండించింది. ఇరాన్ తమను మోసం చేసిందని ఖతర్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దాడులు చేయట్లేదని చెబుతూ డ్రోన్లతో విరుచుకుపడుతోందని మండిపడింది.

News March 9, 2026

బేర్ పంజా.. సెన్సెక్స్ 2వేల పాయింట్లు క్రాష్!

image

యుద్ధం, క్రూడ్ ఆయిల్ ధరల ఎఫెక్ట్ ఈరోజు స్టాక్ మార్కెట్లపై భారీగా పడింది. సెన్సెక్స్ 2341 పాయింట్లు కోల్పోయి 76,605కు చేరగా.. నిఫ్టీ 700 పాయింట్లు కోల్పోయి 23,741 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ టాప్ 30 ఇండెక్స్ సూచీలో అన్ని షేర్లు నష్టాల్లోనే ఉన్నాయి. రూపాయి విలువ సైతం జీవితకాల కనిష్ఠానికి చేరింది. ఒక డాలరుకు 92.30గా ఉంది. FII అమ్మకాలు కూడా మార్కెట్‌పై ప్రభావం చూపిస్తున్నాయి.