News September 27, 2024
సెమీ కండక్టర్ల ప్లాంట్: మోదీని కలిసిన టాటా సన్స్, PSMC టీమ్
టాటాసన్స్, తైవాన్ కంపెనీ PSMC లీడర్‌షిప్ టీమ్ PM నరేంద్రమోదీని కలిసింది. గుజరాత్ ఢోలేరాలో నెలకొల్పే సెమీ కండక్టర్ తయారీ ప్లాంట్ FAB అప్డేట్స్‌ను ఆయనకు తెలియజేసింది. భారత్‌లో తమ ఫూట్‌ప్రింట్ పెంచుకొనేందుకు PSMC ఆసక్తి ప్రదర్శించినట్టు మోదీ ట్వీట్ చేశారు. FAB కోసం ఈ 2 కంపెనీలు రూ.91000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ప్రతి నెలా 50వేల వేఫర్స్ ఉత్పత్తి చేసే ఈ కంపెనీ 20వేల జాబ్స్ క్రియేట్ చేయనుంది.
Similar News
News October 5, 2024
అత్యంత అరుదైన ఖగోళ దృశ్యం.. మళ్లీ 80వేల ఏళ్ల తర్వాతే!
మరికొన్ని రోజుల్లో ఆకాశంలో అరుదైన దృశ్యం ఆవిష్కృతం కానుంది. సుచిన్‌షాన్-అట్లాస్ అనే తోకచుక్క భూమికి 44 మిలియన్ మైళ్ల దూరం నుంచి వెళ్లనుందని నాసా వెల్లడించింది. 2023లో సూర్యుడికి అత్యంత సమీపంగా ప్రయాణించినప్పుడు దీన్ని తొలిసారి గుర్తించామని పేర్కొంది. ఈ నెల 9-10 తేదీల మధ్య స్పష్టంగా కనిపించే అవకాశం ఉందని వివరించింది. ఈ తోకచుక్క భూమి సమీపానికి మళ్లీ వచ్చేది మరో 80వేల సంవత్సరాల తర్వాతే!
News October 5, 2024
హర్షసాయిపై లుక్‌అవుట్ నోటీసులు
TG: అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ యూట్యూబర్ హర్షసాయి కోసం HYD నార్సింగి పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. అతడిపై లుక్‌అవుట్ నోటీసులు జారీ చేశారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం చేశాడని, రూ.2 కోట్ల డబ్బు కూడా తీసుకున్నాడని ఓ మహిళ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News October 5, 2024
రివర్స్ టెండరింగ్ అంటే ఏమిటి?
ఏదైనా ప్రాజెక్టుకు ఖరారైన కాంట్రాక్ట్‌కు మళ్లీ టెండర్లు పిలవడాన్ని రివర్స్ టెండరింగ్ అంటారు. మొదటిసారి పిలిచిన టెండర్లలో అవకతవకలు జరగడం లేదా ఆ పనిని మరింత చౌకగా చేయడానికి అవకాశం ఉందని తేలితే రివర్స్ టెండరింగ్‌కు పిలుస్తారు. జాతీయ స్థాయిలో NTPC, కోల్ ఇండియా, సోలార్ పవర్ కార్పొరేషన్ అమలు చేస్తున్న ఈ విధానాన్ని YCP ప్రభుత్వం తొలిసారి ఏపీలో తీసుకొచ్చింది. దాన్ని కూటమి సర్కార్ రద్దు చేసింది.