News June 27, 2024
సెమీఫైనల్.. భారత్ ఫస్ట్ బ్యాటింగ్
భారత్‌తో జరుగుతున్న టీ20WC సెమీఫైనల్ మ్యాచులో ఇంగ్లండ్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ తొలుత బ్యాటింగ్‌కు దిగనుంది. రా.9.15 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
IND: రోహిత్, కోహ్లీ, పంత్, సూర్యకుమార్, దూబే, హార్దిక్, జడేజా, అక్షర్, కుల్దీప్, బుమ్రా, అర్ష్‌దీప్
ENG: బట్లర్, సాల్ట్, బెయిర్‌స్టో, బ్రూక్, లివింగ్‌స్టోన్, మోయిన్ అలీ, సామ్ కరన్, జోర్డాన్, రషీద్, ఆర్చర్, టోప్లీ
Similar News
News December 11, 2024
రాష్ట్రంలో కొత్త టూరిజం పాలసీ
AP: రాష్ట్ర ప్రభుత్వం కొత్త టూరిజం పాలసీని విడుదల చేసింది. వచ్చే ఐదేళ్లలో ఆర్థిక వృద్ధి, ఉపాధి కల్పన లక్ష్యంగా కొత్త విధానం తీసుకొచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది. పర్యాటక ప్రాజెక్టులకు సంబంధించి మౌలిక సదుపాయాలు కల్పించడమే పాలసీ ముఖ్య ఉద్దేశమంది. ఎకో, క్రూయిజ్, బ్యాక్ వాటర్ టూరిజం, బీచ్ సర్క్యూట్‌లను ప్రోత్సహించడంతో పాటు ఆయా రంగాల్లో పెట్టుబడులు ఆకర్షించేలా పాలసీ రూపొందించినట్లు వివరించింది.
News December 11, 2024
పుట్టినరోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News December 11, 2024
మోహన్‌బాబు బౌన్సర్ల బైండోవర్‌కు ఆదేశం
TG: హైదరాబాద్ జల్‌పల్లిలో మోహన్‌బాబు నివాసం వద్ద జరిగిన మీడియాపై దాడి ఘటనను పోలీస్‌శాఖ సీరియస్‌గా తీసుకుంది. ఈ క్రమంలో ఆయన చుట్టూ ఉన్న బౌన్సర్లను బైండోవర్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అదే విధంగా ఆయనతో పాటు విష్ణు వద్ద ఉన్న గన్లను డిపాజిట్ చేయాలని ఆదేశించింది. ఈ ఘటనకు సంబంధించి రేపు ఉదయం విచారణకు రావాలని వీరిద్దరితో పాటు మనోజ్‌కు రాచకొండ పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.