News February 8, 2025

సంచలన వ్యాఖ్యలు.. కేజ్రీవాల్ సీఎం అవుతారు

image

ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్‌పై పంజాబ్ కాంగ్రెస్ నేత ప్రతాప్ సింగ్ బజ్వా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ఓటమితో డీలా పడ్డ కేజ్రీవాల్ త్వరలోనే పంజాబ్ సీఎం అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తారని వ్యాఖ్యానించారు. ‘ప్రస్తుత సీఎం భగవంత్ మాన్‌ను కేజ్రీవాల్ రీప్లేస్ చేసే అవకాశం ఉంది. పంజాబ్‌కు హిందూ వ్యక్తి సీఎం అవుతారని రాష్ట్ర AAP అధ్యక్షుడు అమన్ అరోరా కూడా ఇటీవల అన్నారు’ అని బజ్వా గుర్తుచేశారు.

Similar News

News February 8, 2025

ఢిల్లీలో కాంగ్రెస్ ‘జీరో హ్యాట్రిక్’ రికార్డ్ ఇందుకేనేమో?

image

ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్నఢిల్లీ, ప్రస్తుతం సున్నాలతో హ్యాట్రిక్ కొట్టింది. 2013లో హస్తం పార్టీ తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడంతో ప్రజలు ఆప్ వైపు మెుగ్గుచూపారు. షీలాదీక్షిత్ తర్వాత మోదీ, కేజ్రీవాల్‌ను ఎదుర్కొనే నాయకుడు దొరకలేదు. కిందిస్థాయి సమస్యలను ప్రజల దృష్టికి తీసుకెళ్లడంలో పార్టీ విఫలమైంది. వీటితో పాటు ఇండియా కూటమి విభేదాలు పార్టీకి ఇబ్బందులు తెచ్చిపెట్టినట్లు భావిస్తున్నారు.

News February 8, 2025

‘మీసేవ’లో రేషన్ కార్డుల దరఖాస్తులు స్వీకరించట్లేదు: పౌరసరఫరాలశాఖ

image

TG: ‘మీసేవ’ ద్వారా రేషన్ కార్డుల దరఖాస్తులపై పౌరసరఫరాలశాఖ క్లారిటీ ఇచ్చింది. కొత్త రేషన్ కార్డులకు ‘మీసేవ’ ద్వారా అప్లికేషన్లు స్వీకరించట్లేదని, దీనిపై ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని స్పష్టం చేసింది. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను ఆన్‌లైన్ చేయాలని మాత్రమే ‘మీసేవ’ను కోరామని వెల్లడించింది. మార్పులు, చేర్పులకు ‘మీసేవ’ ద్వారా దరఖాస్తులు వస్తున్నాయని పేర్కొంది.

News February 8, 2025

మెటాలో 3,000 మందికి లేఆఫ్స్?

image

టెక్ దిగ్గజం మెటా భారీ లేఆఫ్స్‌కు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ నెల 10 నుంచి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3000 మందిని ఉద్యోగాల నుంచి తొలగించనున్నట్లు సమాచారం. సుమారు 12 దేశాల్లో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ ఉంటుందని వార్తలు వస్తున్నాయి. జాబ్ కోల్పోయినవారికి సెవెరెన్స్ ప్యాకేజీ ఇస్తారని టాక్. పనితీరు సరిగ్గా లేని ఉద్యోగులను మాత్రమే తొలగించనున్నట్లు మెటా గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే.

error: Content is protected !!