News August 20, 2024

రాష్ట్రంలో సీబీఐ విచారణకు ప్రభుత్వం అనుమతి

image

AP: రాష్ట్రంలో CBI విచారణకు అనుమతిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేంద్ర సంస్థలు, ఉద్యోగులు, ప్రైవేట్ సంస్థలపై నేరుగా విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ గెజిట్ జారీ చేసింది. అయితే స్టేట్ ఎంప్లాయిస్ విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని ఉత్తర్వుల్లో పేర్కొంది. జులై 1 నుంచే ఇది అమల్లోకి వచ్చినట్లు వెల్లడించింది. అప్పట్లో చంద్రబాబు CMగా ఉన్నప్పుడు రాష్ట్రంలో CBI విచారణను రద్దు చేశారు.

Similar News

News September 18, 2024

వచ్చే ఏడాది నుంచి విద్యార్థులకు కొత్త యూనిఫామ్

image

AP: ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు ఇచ్చే యూనిఫామ్‌లను వచ్చే విద్యాసంవత్సరంలో మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే స్కూల్ బ్యాగ్, షూ, బెల్టులలో నాణ్యత పెంచాలని అధికారులను ఆదేశించింది. అక్టోబర్ మొదటి వారంలోనే టెండర్లు నిర్వహించి వచ్చే ఏడాది పాఠశాలలు తెరిచే రోజే పిల్లలకు కిట్లు అందించేలా ప్రణాళిక సిద్ధం చేసింది. వాటిపై ఎలాంటి పార్టీల రంగులు లేకుండా చర్యలు తీసుకోనుంది.

News September 18, 2024

టాలీవుడ్‌లో లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేయండి: TFCC

image

జానీ మాస్టర్‌‌పై లైంగిక వేధింపుల కేసు నేపథ్యంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్(TFCC) స్పందించింది. సినీ ఇండస్ట్రీలో ఇలా వేధింపులు ఎదుర్కొన్నవారు తమకు ఫిర్యాదు చేయాలని కోరింది. హైదరాబాద్‌లోని TFCC ఆఫీస్ వద్ద ఉ.6 నుంచి రా.8 వరకు కంప్లైంట్ బాక్స్ అందుబాటులో ఉంటుందని తెలిపింది. పోస్ట్‌ లేదా ఫోన్‌ 9849972280, మెయిల్‌ ఐడీ complaints@telugufilmchamber.in ద్వారా ఫిర్యాదు చేయవచ్చని సూచించింది.

News September 18, 2024

YELLOW ALERT: మళ్లీ వర్షాలు

image

TG: వారం రోజులుగా పొడి వాతావరణం ఉన్న రాష్ట్రంలో మళ్లీ వర్షాలు కురవనున్నాయి. ఈ నెల 21, 22 తేదీల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.