News June 20, 2024
పట్నా హైకోర్టు సంచలన నిర్ణయం

బిహార్ ప్రభుత్వం గత ఏడాది అమలులోకి తెచ్చిన 65% రిజర్వేషన్లను పట్నా హైకోర్టు రద్దు చేసింది. బీసీ, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీల కోసం రిజర్వేషన్లను పెంచుతూ గతంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టింది. సమానత్వం లోపించడమే కాక ఆర్టికల్ 14,15,16లను ఉల్లంఘించే విధంగా ఈ చట్టాలు ఉన్నాయని తెలిపింది. కాగా విద్యాసంస్థల్లో అడ్మిషన్లు, ఉద్యోగాలకు సంబంధించి 2023లో ప్రభుత్వం చట్టాలను సవరించింది.
Similar News
News November 13, 2025
రూ.12,000 కోట్ల కుంభకోణం.. JIL MD అరెస్ట్

రూ.12,000 కోట్ల మనీలాండరింగ్ కేసుకు సంబంధించి జేపీ ఇన్ఫ్రాటెక్ లిమిటెడ్ (JIL) ఎండీ మనోజ్ గౌర్ను అరెస్టు చేసినట్లు ED అధికారులు తెలిపారు. గృహ కొనుగోలుదారుల నుంచి సేకరించిన నిధుల మళ్లింపు, దుర్వినియోగంలో గౌర్ ప్రమేయం ఉందని గుర్తించారు. ఈ కేసులో జేపీ గ్రూప్ అనుబంధ సంస్థలైన జేపీ ఇన్ఫ్రాటెక్ లిమిటెడ్, జైప్రకాశ్ అసోసియేట్స్ లిమిటెడ్లో పెద్ద ఎత్తున ఆర్థిక అవకతవకలు జరిగినట్లు భావిస్తున్నారు.
News November 13, 2025
32 కార్లతో సీరియల్ అటాక్స్కు కుట్ర?

ఢిల్లీ బ్లాస్ట్ దర్యాప్తులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. పేలుడు పదార్థాల తరలింపునకు, బాంబుల డెలివరీకి 32 కార్లను టెర్రరిస్టులు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. బాబ్రీ మసీదును కూల్చిన రోజు(DEC 6) సీరియల్ అటాక్స్కు కుట్ర చేసినట్లు దర్యాప్తు వర్గాలు తెలిపాయి. ఢిల్లీలోని 6 లొకేషన్లు సహా దేశంలోని పలు ప్రాంతాలను టార్గెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 4 కార్లను అధికారులు గుర్తించారని సమాచారం.
News November 13, 2025
యక్ష ప్రశ్నలు, సమాధానాలు – 3

13. భూమి కంటె భారమైనది? (జ.జనని)
14. ఆకాశం కంటె పొడవైనది? (జ.తండ్రి)
15. గాలి కంటె వేగమైనది? (జ.మనస్సు)
16. మానవునికి సజ్జనత్వం ఎలా వస్తుంది? (జ.ఇతరులు తనపట్ల ఏ పని చేస్తే, ఏ మాట మాట్లాడితే తన మనస్సుకు బాధ కలుగుతుందో.. తాను ఇతరుల పట్ల అలా ప్రవర్తించకుండా ఉండనివారికి సజ్జనత్వం వస్తుంది.)
17. తృణం కంటె దట్టమైనది ఏది? (జ.చింత)
<<-se>>#YakshaPrashnalu<<>>


