News June 20, 2024
పట్నా హైకోర్టు సంచలన నిర్ణయం
బిహార్ ప్రభుత్వం గత ఏడాది అమలులోకి తెచ్చిన 65% రిజర్వేషన్లను పట్నా హైకోర్టు రద్దు చేసింది. బీసీ, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీల కోసం రిజర్వేషన్లను పెంచుతూ గతంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టింది. సమానత్వం లోపించడమే కాక ఆర్టికల్ 14,15,16లను ఉల్లంఘించే విధంగా ఈ చట్టాలు ఉన్నాయని తెలిపింది. కాగా విద్యాసంస్థల్లో అడ్మిషన్లు, ఉద్యోగాలకు సంబంధించి 2023లో ప్రభుత్వం చట్టాలను సవరించింది.
Similar News
News September 9, 2024
BREAKING: ఆ రెండు జిల్లాల్లో రేపు స్కూళ్లకు సెలవు
AP: భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో అల్లూరి జిల్లావ్యాప్తంగా రేపు కూడా స్కూళ్లకు సెలవు ప్రకటిస్తూ కలెక్టర్ దినేశ్ ఉత్తర్వులిచ్చారు. ఏలూరు జిల్లాలోని భీమడోలు, పెదపాడు, మండవల్లి, కైకలూరు, ఏలూరు, ముదినేపల్లి, కలిదిండి మండలాల్లోని పలు పాఠశాలలకు అధికారులు సెలవు ఇచ్చారు. మిగతా స్కూళ్లు యథాతథంగా నడుస్తాయని చెప్పారు.
News September 9, 2024
సీఎం మమత చెప్పేవి అబద్ధాలు: ట్రైనీ డాక్టర్ తల్లి
కోల్‌కతాలో హత్యాచారానికి గురైన వైద్యురాలి పేరెంట్స్‌కు పోలీసులు లంచం ఇవ్వజూపారన్న ఆరోపణలను CM మమత ఖండించారు. దీంతో ఆమెపై మృతురాలి తల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. CM అబద్ధాలు చెబుతున్నారని దుయ్యబట్టారు. ‘మీకు పరిహారం ఇప్పిస్తానని CM అన్నారు. మీ కూతురి జ్ఞాపకార్థం ఏదైనా నిర్మించుకోవచ్చన్నారు. అయితే నా కుమార్తెకు న్యాయం జరిగినప్పుడు మీ ఆఫీస్‌కు వచ్చి పరిహారం తీసుకుంటానని చెప్పా’ అని పేర్కొన్నారు.
News September 9, 2024
‘మేనన్’ నా ఇంటి పేరు కాదు: హీరోయిన్ నిత్య
విభిన్నమైన పాత్రలు పోషిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి నిత్యామేనన్ తన పేరు గురించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ‘మేనన్’ అనేది తన ఇంటి పేరు కాదని తెలిపారు. ‘నా అసలు పేరు ఎన్ఎస్ నిత్య. కులాన్ని పేర్లతో ముడిపెట్టడం నచ్చక మా కుటుంబంలో ఎవరూ ఇంటి పేరు వాడరు. నటిగా పలు చోట్లకు ప్రయాణాలు చేయాల్సి రావడంతో న్యూమరాలజీ ఆధారంగా పాస్‌పోర్టులో ‘మేనన్’ అని జత చేశాం’ అని చెప్పుకొచ్చారు.