News March 7, 2025
పరువు హత్య కేసులో సంచలన విషయాలు

AP: అనంతపురం(D)లో కలకలం రేపిన <<15657872>>పరువు హత్య<<>> కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ‘వేరే కులం వ్యక్తితో ప్రేమ వద్దని తండ్రి చెప్పినా కూతురు వినలేదు. చావడానికైనా సిద్ధమేనని చెప్పింది. దీంతో ఉరివేసుకోవాలని తండ్రి గద్దించగా కూతురు అలాగే చేసింది. తర్వాత పెద్ద అల్లుడి సాయంతో మృతదేహాన్ని కిందకు దించాడు. సర్టిఫికెట్లు, పుస్తకాలను బాడీపై ఉంచి పెట్రోల్‌తో కాల్చేశాడు’ అని పోలీసులు తెలిపారు.
Similar News
News March 25, 2025
డైరెక్టర్ భారతీరాజా కుమారుడు మృతి

తమిళ ప్రముఖ డైరెక్టర్ భారతీరాజా కుమారుడు మనోజ్ భారతీరాజా(48) కన్నుమూశారు. కార్డియాక్ అరెస్ట్ వల్ల చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ కొద్దిసేపటి కిందటే తుదిశ్వాస విడిచారు. కాగా, ఆయన తాజ్‌మహల్, అల్లీ అర్జున, అన్నక్కోడి, పల్లవన్, తదితర తమిళ చిత్రాల్లో నటించారు.
News March 25, 2025
అత్యంత విలువైన స్టీల్ కంపెనీగా JSW స్టీల్ రికార్డ్

ప్రపంచంలోనే అత్యంత విలువైన స్టీల్ కంపెనీగా JSW స్టీల్ రికార్డు సృష్టించింది. $30.31B మార్కెట్ విలువను సాధించింది. $90Mతో ఆర్సెలార్ మిత్తల్, $3Bతో న్యూకోర్ కార్ప్‌ను వెనక్కి నెట్టేసింది. ఈ భారతీయ కంపెనీ విజయనగర, డోల్వి, సేలమ్‌లో ప్లాంట్లు, అమెరికా, ఇటలీలో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ప్రస్తుత 35.7MT ఉత్పత్తి సామర్థ్యాన్ని FY28లో 43.5 MT, FY31లో 51.5 MTకి పెంచుకోవాలని టార్గెట్ పెట్టుకుంది.
News March 25, 2025
BIG NEWS: ఏప్రిల్ 1 నుంచి ‘సదరమ్’ స్లాట్లు

AP: దివ్యాంగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సామాజిక పింఛన్ల తనిఖీ కోసం కొంతకాలంగా నిలిపివేసిన సదరమ్ స్లాట్లను ఏప్రిల్ 1 నుంచి పున:ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఎంపిక చేసిన ఏరియా, జిల్లా, టీచింగ్ ఆస్పత్రులు/GGHలలో ప్రతి మంగళవారం స్లాట్‌లు అందుబాటులో ఉంటాయని సెకండరీ హెల్త్ డైరెక్టర్ ఎ.సిరి తెలిపారు. పరీక్షల అనంతరం అర్హులకు సర్టిఫికెట్లు జారీ చేస్తామని పేర్కొన్నారు.