News April 24, 2024

కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు

image

బెంగాల్ స్కూల్ రిక్రూట్‌మెంట్ స్కామ్ కేసుపై కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 2016 నాటి రిక్రూట్‌మెంట్ చెల్లదని పేర్కొంది. 9, 10, 11, 12వ తరగతిలో గ్రూప్ సీ, డీలో చేసిన నియామకాలన్నీ చట్ట విరుద్ధమని తెలిపింది. దీంతో నియమితులైన 23వేల మందికి పైగా ఉద్యోగులను వెంటనే తొలగించాలంటూ తీర్పు చెప్పింది. వీరందరూ నాలుగు వారాల్లోగా 12 శాతం వడ్డీతో మొత్తం జీతాన్ని తిరిగివ్వాలని తెలిపింది.

Similar News

News February 4, 2026

జ్ఞానానికి కేంద్రం ‘ఆజ్ఞా చక్రం’

image

2 కనుబొమ్మల మధ్య ఉండే ఈ చక్రం జ్ఞానానికి, అంతర్ దృష్టికి కేంద్రం. ఇది సమతుల్యంగా ఉంటే ఏకాగ్రత, స్పష్టమైన ఆలోచనలు, భవిష్యత్తును ఊహించే శక్తి పెరుగుతాయి. ఇది అస్థిరంగా ఉంటే తలనొప్పి, గందరగోళం, చూపు మందగించడం వంటివి జరుగుతాయి. దీనిని ఉత్తేజితం చేయడానికి ‘ఓం’ మంత్రాన్ని జపిస్తూ భృకుటిపై దృష్టి సారించి ధ్యానం చేయాలి. నీలి రంగు/ఊదా రంగు దుస్తులు వాడటం, నిశ్శబ్దంగా గడపడం వల్ల ఈ చక్రం శక్తివంతమవుతుంది.

News February 4, 2026

రికార్డు స్థాయిలో UPI లావాదేవీలు: పంకజ్ చౌదరి

image

డిజిటల్ చెల్లింపులు జరిపేవారి సంఖ్య పెరగడంతో.. భారత UPI లావాదేవీలు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరం DEC వరకు UPI ద్వారా రికార్డు స్థాయిలో రూ.230 లక్షల కోట్ల లావాదేవీలు జరిగాయని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాజ్యసభలో వెల్లడించారు. 2022-23లో జరిగిన మొత్తం రూ.139 లక్షల కోట్ల లావాదేవీలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువని, భారత్ వెలుపలా UPI వినియోగం పెరగడం హర్షణీయమన్నారు.

News February 4, 2026

నేడు అంబటి కుటుంబాన్ని పరామర్శించనున్న జగన్

image

AP: సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్టైన మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబాన్ని YCP అధినేత జగన్ ఇవాళ పరామర్శించనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న జగన్.. రోడ్డు మార్గాన 11 గంటలకు గుంటూరులోని రాంబాబు ఇంటికి చేరుకుంటారు. అయితే గుంటూరు పరిధిలో 1861లోని సెక్షన్ 30 అమల్లో ఉందని, రాజకీయ ర్యాలీ, సమావేశం నిర్వహించడం, పాల్గొనడం నిషేధమని పోలీసు శాఖ పేర్కొంది.